Telugu Romantic Movies OTT : తెలుగులో ఎన్నో రకాల సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని స్పెషల్ డేస్ కి సంబంధించిన సినిమాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఫిబ్రవరి నెలలో ప్రేమికులకు ప్రత్యేకమైన రోజుగా వాలంటైన్స్ డే ని జరుపుకుంటారు.. ఈనెల 14న ఈరోజును స్పెషల్ గా జరుపుకుంటారు. ప్రేమికుల రోజును మీ పార్ట్నర్ తో మరింత స్పెషల్ గా జరుపుకొనే వారికి ఎవరు గ్రీన్ రొమాంటిక్ మూవీస్ లను ఓటీటి సంస్థలు అందుబాటులోకి తీసుకొని వచ్చాయి .. ఆ సినిమాలు ఏంటో? ఎక్కడ చూడొచ్చునో ఒకసారి చూసేద్దాం..
గీతాంజలి..
అక్కినేని నాగార్జున నటించిన ఎవర్గ్రీన్ మూవీ గీతాంజలి.. 36 ఏళ్ల కిందట వచ్చినా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరగా ఉంది. ఈ మూవీలో నాగార్జున సరసన గిరజ నటించింది. అప్పటిలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో చూశాం. ప్రస్తుతం ఈ మూవీని వాలెంటెన్స్ డే స్పెషల్ గా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ తీసుకొచ్చింది.
రోజా..
అరవింద స్వామీ, మధు జంటగా నటించిన మూవీ రోజా.. ఇది 1992 లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళ సినిమా కాగా తెలుగుతో సహా హిందీ, మళయాళం, మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు.. ప్రస్తుతం ఈ మూవీని అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ లో చూడొచ్చు..
తొలిప్రేమ..
పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి నటించిన మరో ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ ఈ తొలి ప్రేమ. ఫస్ట్ లవ్ లోని ఆ మాధుర్యాన్ని అందించే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు..
నిన్నే పెళ్లాడతా..
నాగార్జున హీరోగా నటించిన మరో లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ నిన్నే పెళ్ళాడుతా.. ఈ మూవీని ప్రేమికుల రోజు స్పెషల్ గా మరోసారి స్ట్రీమింగ్ తీసుకొస్తుంది హాట్ స్టార్..
ఏ మాయ చేసావే..
నాగ చైతన్య, సమంత కలిసి చేసిన ప్రేమ మాయే ఈ ఏ మాయ చేసావే. 2010లో వచ్చిన ఈ సినిమా ఓ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీయే. ఈ మూవీని ప్రస్తుతం ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్ పై చూసే అవకాశం ఉంది.
బొమ్మరిల్లు..
సిద్ధార్థ్, జెనీలియా నటించిన మూవీ బొమ్మరిల్లు. ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక, తండ్రి మాటను కాదనలేక సతమతమయ్యే ఓ యువకుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ మూవీని సన్ నెక్ట్స్, యూట్యూబ్ లలో చూడొచ్చు..
వీటితోపాటు మరికొన్ని సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ రాబోతున్నాయి.. అందులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ కూడా ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఇక మగధీర, దేవదాస్ మూవీలు కూడా వాలెంటైన్స్ డే స్పెషల్గా స్ట్రీమింగ్ రాబోతున్నాయి.. ప్రేమికులకు వెరీ స్పెషల్ గా అనిపించే ఈ మూవీలను మీకు నచ్చిన పార్ట్నర్ తో మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.. ఇక ఓటిటిలోనే కాదు థియేటర్లలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి ఆ సినిమాలు ఎలాంటి టాక్ ని అందుకుంటాయో చూడాలి..