BigTV English

Mahesh Babu – Rajinikanth: సూపర్ స్టార్స్ కాంబోలో మూవీ మిస్.. ఏంటో తెలుసా..?

Mahesh Babu – Rajinikanth: సూపర్ స్టార్స్ కాంబోలో మూవీ మిస్.. ఏంటో తెలుసా..?

Mahesh Babu – Rajinikanth:సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు రజనీకాంత్ (Rajinikanth), మహేష్ బాబు (Maheshbabu ). కోలీవుడ్ (Kollywood) ఇండస్ట్రీకి రజనీకాంత్, టాలీవుడ్(Tollywood ) ఇండస్ట్రీకి మహేష్ బాబు సూపర్ స్టార్ గా పేర్లు సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయింది అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ ? వీరిద్దరి కాంబినేషన్లో సినిమానా..? ఆ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేశారు? అసలు వీరిద్దరి కాంబినేషన్లో ఏ డైరెక్టర్ అలాంటి ప్రయోగం చేయాలనుకున్నారు..? మరి ఎందుకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కలేదు ? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


మహేష్ బాబు – రజినీకాంత్ కాంబోలో మూవీ మిస్..

సాధారణంగా ఇద్దరు మల్టీ టాలెంటెడ్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తున్నారు అంటే, అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే సినిమాలో అంటే వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా? అవును ఆ ఇద్దరు సూపర్ స్టార్ హీరోలతో ఒక సినిమా చేయాలనుకున్నారట డైరెక్టర్ కొరటాల శివ. (koratala siva).. ఈ విషయం తెలియగానే అభిమానులు కూడా సంతోషపడ్డారు. రికార్డులు బ్రేక్ అవుతాయని, బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఆ తర్వాత మిస్ అయింది అని తెలిసి, అందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు ఎన్టీఆర్(NTR ), మోహన్ లాల్ (Mohan Lal) కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’.


జనతా గ్యారేజ్ మూవీని మిస్ చేసుకున్న మహేష్ బాబు..

అసలు విషయంలోకెళితే.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ.. మహేష్ బాబు, రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారట. అప్పటికే కొరటాల శివ మహేష్ బాబుకు రెండు హిట్ సినిమాలు ఇచ్చి ఆయనను ఫ్లాప్ నుంచి బయట పడేసాడు. ఈ సినిమా కూడా చేసి ఉంటే వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ అయి ఉండేది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొదట కొరటాల శివ జనతా గ్యారేజ్ కథను మహేష్ బాబుకి వినిపించారట. అదే సమయంలో మోహన్ లాల్ పాత్రలో రజనీకాంత్ ను తీసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే మొదట్లోనే మహేష్ బాబు కథ నచ్చక రిజెక్ట్ చేశారని, అందుకే ఆ తర్వాత రజనీకాంత్ ని కూడా సంప్రదించలేదని సమాచారం. ఇక మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో ఈ కథ ఎన్టీఆర్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత మోహన్ లాల్ ను పెట్టి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ. ఒకవేళ వీరిద్దరూ కాకుండా సూపర్ స్టార్స్ అయిన మహేష్ బాబు, రజనీకాంత్ గనుక ఈ సినిమా చేసి ఉంటే మాత్రం ఈ సినిమా ఒక అరుదైన రికార్డు సృష్టించేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే భారీ కాంబోని ఆడియన్స్ కూడా మిస్ అయ్యారని చెప్పవచ్చు.

కొరటాల శివ సినిమాలు..

కొరటాల శివ విషయానికి వస్తే.. చివరిగా ఎన్టీఆర్ తో ‘దేవర ‘ సినిమా చేశారు. ఇక మరొకవైపు దేవర -2 కూడా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×