E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Advertisement

Korean Kanakaraju Ott: ఇటీవల కాలంలో సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఆగస్టు మొదటి వారంలో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్(Varun tej) రితికా నాయక్(Rithika Naik) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టు 7వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హర్రర్ కామెడీ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది.

సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్..

కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix) భారీ ధరలకు కొనుగోలు చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా తెలియజేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది..తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

అనంతపురానికి చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) కు కోపమెక్కువ. చెక్కభజన ప్రదర్శనలు చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అతను కియా కంపెనీలో చైత్ర (రితిక నాయక్) తో ప్రేమలో పడతారు. చైత్రకేమో కొరియా వెళ్లాలనేది కల. ఈ సమయంలోనే కొరియాల నుంచి వచ్చిన ఒక వస్తువు నుంచి ఒక ఆత్మ కనకరాజులోకి వెళ్తుంది. అప్పటినుంచి కనకరాజు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఇక ఆత్మ కోరికలు ఏంటో తెలుసుకున్న కనకరాజు తన స్నేహితులతో కలిసి కొరియా వెళ్తాడు. అయితే కనకరాజు శరీరంలోకి వచ్చిన ఆత్మ ఎవరిది? కనకరాజు శరీరంలోకి ఎలా వెళ్ళింది? చివరికి కనకరాజును వదిలి ఆత్మ వెళ్ళిపోయిందా? కనకరాజు తన ప్రేమను చైత్రకు తెలియజేస్తారా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

హర్రర్ కామెడీ సినిమా..

ఇటీవల కాలంలో ప్రేక్షకులు హర్రర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక హర్రర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొరియన్ కనకరాజు సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఇలాంటి ఒక అద్భుతమైన హర్రర్ కామెడీ సినిమాని థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు సెప్టెంబర్ 4వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇలా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మెగా ప్రిన్స్ కు కొరియన్ కనకరాజు మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి.

Advertisement

Also Read: ఇరుముడి సక్సెస్  పెరిగిన కొమరక్క రెమ్యూనరేషన్.. ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

Related News

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×