E-Paper
Advertisement

సచిన్ దెబ్బకు మూడు రోజులు కోమాలోకి వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్

సచిన్ దెబ్బకు మూడు రోజులు కోమాలోకి వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్
Advertisement

Sachin VS Mohammad Amir:  లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించారు. టన్నుల కొద్ది పరుగులు చేయడమే కాకుండా సెంచరీలు అటు అర్ధ సెంచరీలతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ గా సచిన్ టెండూల్కర్ ఎదిగారు. అలాంటి సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేయాలంటే పెద్ద టాస్కే. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ బౌలర్లు… సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ వేయాలంటేనే భయపడి పోయేవారు. అప్పట్లో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్…. పాకిస్తాన్ బౌలర్లకు నరకం చూపించేవాడు. సచిన్ వికెట్ తీస్తే చాలు… టీమిండియాను ఓడించగలం అన్న స్థాయికి పాకిస్తాన్ ను తీసుకువచ్చాడు.

సచిన్ దెబ్బకు 3 రోజులు కోమాలోకి వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఊచకోత కోస్తాడు. విరాట్ కోహ్లీ ఎలా పాకిస్తాన్ పైన ఆడే వాడో… అప్పట్లో సచిన్ కూడా తన మాస్టర్ స్ట్రోక్ చూపించేవాడు. అలాంటి సచిన్ టెండూల్కర్ కారణంగా ఓ పాకిస్తాన్ బౌలర్ మూడు రోజుల పాటు కోమాలోకి వెళ్ళాడు. ఆ బౌలర్ ఎవరో కాదు మహమ్మద్ అమీర్. 17 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేసే అవకాశం మహమ్మద్ అమీర్ కు వచ్చింది. ఆ సమయంలో గుండెపోటు వచ్చినంత పని అయిందని తాజాగా మహమ్మద్ అమీర్ వెల్లడించారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

సచిన్ గొప్ప క్రికెటర్ అని… అతనికి బౌలింగ్ చేయడం తన అదృష్టం అన్నారు. అతడికి బౌలింగ్ చేస్తుంటే హార్ట్ ఎటాక్ వచ్చినట్లే తనకు అనిపించిందని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అదే సమయంలో అతని వికెట్ కూడా తాను తొలిసారి తీశానని.. ఈ దెబ్బకు పాకిస్తాన్ లో తనకు పూజలు చేయడం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. సచిన్ టెండూల్కర్ వికెట్ తీసిన తర్వాత మూడు రోజులపాటు స్పృహ లేకుండా కోమాలోకి వెళ్లినట్లే అయిందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మూడు రోజులు ఏం జరిగిందో తనకు అర్థం కాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సచిన్ వికెట్ ఎప్పుడు తీశాడంటే ?

Advertisement

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ వికెట్ ను 2009లో మహమ్మద్ అమీర్ తీశాడు. 2009 సెప్టెంబర్ 25వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దక్షిణాఫ్రికాలో కీలక మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ 302 పరుగులు చేసింది. ఆ సమయంలో టీమిండియా బ్యాటింగ్ కు దిగగా, సచిన్ టెండూల్కర్ వికెట్ ను ఎనిమిది పరుగుల వద్ద తీశానని మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్ అనంతరం మూడు రోజుల పాటు స్పృహ లేకుండా ఉండిపోయానని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇదే మ్యాచ్ లో 54 పరుగులతో పాకిస్తాన్ గెలిచిందని మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

విరాట్ కోహ్లీ పరువు తీసిన అంబటి రాయుడు… ధోని, రోహిత్ వల్లే ఐసీసీ ట్రోఫీలు సాధ్యం?

నా దృష్టిలో RCB చాలా చెత్త టీమ్…వాళ్లు ఉగాండా కంటే దారుణం

పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టేందుకు నన్ను ధోని పావులా వాడుకున్నాడు

టీమిండియాకు అవ‌మానం..టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్‌, కంపుకొట్టే టాయిలెట్స్‌

ఇమ్రాన్ ఖాన్ ఎక్క‌డ చ‌స్తే మాకేంటి ? ఇంగ్లండ్ ను ఓడించే ప‌నిలో మేం ఉన్నాం

స్టంపింగ్ చేస్తున్న‌ట్లు ముందే చెబుతాడు…ధోని సీక్రెట్ బ‌య‌ట పెట్టిన అశ్విన్‌

Big Stories

Advertisement
×