Aadarsha Kutumbham OTT : విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్లో మొట్టమొదటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆదర్శ కుటుంబం మెప్పించలేక పోయింది. థియేటర్ రన్ పూర్తి అయ్యేసరికి నష్టాలతోనే ఈ సినిమా క్లోజ్ అయిందని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో డిజిటల్ మీడియాలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిని వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ విషయం గురించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు.
ఇలా పోస్టర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్ హౌస్ నెంబర్ 47లోకి ఎవరో కొత్త ఫ్యామిలీ వస్తున్నారట.. కలుద్దామా? అంటూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన తేదీని అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని థియేటర్లలో చూడని వారు ఏకంగా కుటుంబ సమేతంగా ఆదర్శ కుటుంబం సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
House No. 47 lo ki evvaro kotha family vastunaru anta. Kaluddama? 👀🏠 pic.twitter.com/7b5nwQfnrC
— Netflix India South (@Netflix_INSouth) November 26, 2026
ఈ సినిమాలో వెంకటేష్(Venkatesh) శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కాంబినేషన్లో ఇదివరకు సినిమాలు వచ్చాయి కానీ ఈయన డైరెక్షన్లో మాత్రం రాలేదు. వెంకటేష్ సినిమాల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైటర్ అలాగే కథా రచయితగా పనిచేశారు కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ చేసిన మొట్టమొదటి సినిమా ఆదర్శ కుటుంబం కావటం విశేషం.ఇక ఈ సినిమా పూర్తి కావడంతో వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
Also Read: నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. బయటపెట్టిన రాజ్ పిన్నమ్మ!