Blade Runner 2099 on OTT: హాలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన కల్ట్ ఫ్రాంచైజీ ‘బ్లేడ్ రన్నర్’ (Blade Runner). దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మొదలైన ఈ విజువల్ అద్భుతం, ఇప్పుడు తొలిసారిగా వెబ్ సిరీస్ రూపంలో డిజిటల్ తెరపైకి అడుగుపెట్టింది. అచ్చం మనుషుల్లాగే కనిపించే రోబోలు (రెప్లికెంట్స్) మనుషులనే శాసించే స్థాయికి ఎదిగితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? 2099వ సంవత్సరంలో భూమిపై పరిస్థితులు ఎంత భయానకంగా మారబోతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, సైన్స్ ఫిక్షన్ ప్రియుల నిరీక్షణకు తెరదించుతూ, మోస్ట్ అవైటెడ్ ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్ సిరీస్ ‘బ్లేడ్ రన్నర్ 2099’ (Blade Runner 2099) నేటి నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. ‘బ్లేడ్ రన్నర్’ (1982), ‘బ్లేడ్ రన్నర్ 2049’ (2017) వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలకు సీక్వెల్‌గా వచ్చింది. దిగ్గజ దర్శకుడు రిడ్లీ స్కాట్ రిడ్లీ స్కాట్ నిర్మాణంలో ఆస్కార్ విజేత మిచెల్ యో, హంటర్ షాఫర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భారీ సైఫై థ్రిల్లర్ సిరీస్‌ను సిల్కా లూయిసా తెరకెక్కించారు. సుమారు 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సైబర్‌పంక్ విజువల్స్‌తో ఇది తెరకెక్కింది.
ఈ సిరీస్ కథంతా ‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమా జరిగిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత, 2099వ సంవత్సరంలోని లాస్ ఏంజెల్స్ నగరం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. గతంలో మనుషులు సృష్టించిన బయో ఇంజనీర్డ్ మానవులైన రెప్లికెంట్స్ చేసిన తిరుగుబాటు విజయవంతం కావడంతో, 2099 నాటికి పరిస్థితులు పూర్తిగా తలకిందులవుతాయి. ఇప్పుడు నగరంలో రెప్లికెంట్స్ అధికారంలోకి రాగా, అసలైన మనుషులు సెకండ్ క్లాస్ సిటిజన్స్ మారిపోయి ప్రాణభయంతో బతుకుతుంటారు. ఈ క్రమంలో ఓల్వెన్ అనే రెప్లికాంట్ బ్లేడ్ రన్నర్‌గా పనిచేస్తుంటుంది, అంటే రూల్స్ తప్పిన మనుషులను పట్టుకోవడం ఆమె పని. కానీ ఆమె జీవిత కాలం త్వరలోనే ముగిసిపోయే స్థితిలో ఉంటుంది.
సరిగ్గా ఆ సమయంలోనే కోరా అనే అమ్మాయితో కలిసి ఆమె పనిచేయాల్సి వస్తుంది. అయితే కోరా అసలు మనిషి అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకోవడానికి రెప్లికాంట్‌లా నటిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి పారిపోయిన ఒక వ్యక్తిని వెతుకుతూ ఉంటారు. ఆ వ్యక్తి దగ్గర ఒక పెద్ద రహస్యం దాగి ఉంటుంది, అది గనక బయటపడితే అప్పటికే గొడవలతో ఉన్న ఆ నగరం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ రహస్యం ఏంటి, వీళ్లిద్దరూ కలిసి దాన్ని ఎలా ఆపారు అనేదే ఈ సిరీస్ అసలు కథ. ప్రతీ ఎపిసోడ్ ఊపిరి బిగబట్టి చూసేలా సాగుతుంది. సైఫై యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఇదొక పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్.
ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్ సిరీస్ ‘బ్లేడ్ రన్నర్ 2099’ (Blade Runner 2099) నేటి నుంచే (2026 నవంబర్ 25) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ అన్ని భాగాలు ఒకేసారి అందుబాటులోకి రావడం విశేషం. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: 36 ఏళ్ల క్రితం చనిపోయిన శవం… ప్రతి పౌర్ణమికి రాక్షసుడిగా… ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్