E-Paper
Advertisement

చావు అంచున ఆడిన చివరి ఆట… గుండెను బరువెక్కించే వార్ డ్రామా ఓటీటీలోకి

చావు అంచున ఆడిన చివరి ఆట… గుండెను బరువెక్కించే వార్ డ్రామా ఓటీటీలోకి
Advertisement

The Mosquito Bowl on OTT: యుద్ధం అంటే తుపాకీ కాల్పులు, బాంబుల మోత, ప్రాణాలు కోల్పోయే భయం మాత్రమే కాదు. ఆ యుద్ధంలోకి వెళ్లే సైనికులకు కూడా ఫ్యామిలీ, స్నేహితులు, ఎన్నో ఆశలు ఉంటాయి. అలాగే యుద్ధానికి వెళ్లే ముందు సైనికులు చివరిసారిగా సంతోషంగా గడిపిన క్షణాలు ఎంత విలువైనవో చెప్పే కథలు మనసును కదిలిస్తాయి. అలాంటి ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఒకప్పుడు కాలేజీ ఫుట్‌బాల్ గ్రౌండ్స్ లో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న నలుగురు యువకులు.. దేశం కోసం సైన్యంలో చేరి యుద్ధ రంగంలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడే ముందు వాళ్లు ఆడిన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ వారి జీవితాల్లో ఎలాంటి జ్ఞాపకంగా మిగిలిపోయిందనేదే ఈ సినిమా కథ. ఈ మ్యాచ్ ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కూడా. అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్న ఈ ఎమోషనల్ వార్ డ్రామా పేరు ‘ది మస్కిటో బౌల్’ (The Mosquito Bowl). ఎమోషనల్ వార్ స్పోర్ట్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక మస్ట్ వాచ్ మూవీ.

మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రియల్ స్టోరీ 

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌పై పోరాడేందుకు అమెరికా సైన్యం పసిఫిక్ ప్రాంతంలో మోహరించింది. అప్పుడు గ్వాడల్‌కెనాల్ దీవిలో ఉన్న అమెరికా మెరైన్ సైనికుల్లో చాలామంది ఒకప్పుడు కాలేజీ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడినవారే. వీరిలో కొందరు తమ ఆటతీరుతో మంచి పేరు సంపాదించుకున్నవారు కూడా ఉన్నారు. అయితే యుద్ధం కారణంగా ఆటకు దూరమై సైన్యంలో చేరాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 1944 డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా, నాడు పసిఫిక్ సముద్రంలోని గ్వాడల్‌కెనాల్ అనే దీవిలో అమెరికా సైనికుల మధ్య ఒక ప్రత్యేకమైన ఫుట్‌బాల్ ఆట జరిగింది. యుద్ధ ఒత్తిడిలో ఉన్న సైనికులు కాసేపు సరదాగా గడపడానికి, తమలో ఏ బృందం బాగా ఆడుతుందో తేల్చుకోవడానికి ఈ పోటీ పెట్టుకున్నారు. ఆ దీవిలో విపరీతంగా దోమలు ఉండటం వల్ల, ఈ ఆటను రేడియోలో ప్రసారం చేసిన సైనిక స్టేషన్ పేరు ‘మస్కిటో నెట్‌వర్క్’ కావడం వల్ల దీనికి ‘ది మస్కిటో బౌల్’ (దోమల ఆట) అని పేరు పెట్టారు.

Advertisement

ఆట ఆడటానికి సరైన మైదానం లేకపోయినా, వాళ్లు కేవలం నిక్కర్లు వేసుకుని గట్టి నేల మీద, పదునైన రాళ్ల మధ్య ఎంతో ఉత్సాహంగా ఆడారు. చుట్టూ ఉన్న దాదాపు 1,500 మంది తోటి సైనికులు కేకలు వేస్తూ ప్రోత్సహిస్తుండగా జరిగిన ఈ ఆటలో, చివరికి ఏ జట్టూ గెలవకుండా 0–0 తో సమంగా ముగిసింది. కానీ ఆ ఆటలో వాళ్లు పొందిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మ్యాచ్ జరిగిన సరిగ్గా మూడు నెలల తర్వాత, వీరంతా ఒకినావా అనే ప్రాంతంలో జరిగిన ఒక భీకరమైన యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో ఈ ఫుట్‌బాల్ ఆట ఆడిన 65 మంది సైనికుల్లో 15 మంది చనిపోయారు. ఒకప్పుడు ఎంతో సరదాగా ఆడుకున్న ఈ సైనికుల త్యాగాన్ని గుర్తుచేస్తూ 2022లో ఒక పుస్తకం వచ్చింది, అలాగే దీని ఆధారంగా తీసిన ఈ సినిమా నిన్ననే ఓటీటీలోకి వచ్చింది. ఒక్కసారి చూస్తే మళ్ళీ రిపీట్ చేస్తారు ఈ మూవీని.

ఓటీటీ వివరాలు

పీటర్ బెర్గ్ దర్శకత్వం వహించిన ‘ది మస్కిటో బౌల్’ (The Mosquito Bowl)లో నికోలస్ గాలిట్జైన్, బిల్ స్కార్స్‌గార్డ్, రే నికల్సన్, టామ్ ఫ్రాన్సిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఎమోషనల్ వార్ అండ్ స్పోర్ట్స్ డ్రామా 2026 అక్టోబర్ 30న పరిమిత థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నవంబర్ 25 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. బజ్ బిస్సింగర్ పుస్తకం ఆధారంగా పీటర్ బెర్గ్, మార్క్ ఎల్. స్మిత్ స్క్రీన్‌ప్లే దీనిని రూపొందించారు. ఈ సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలు. Netflix ఇండియాలో ఇంగ్లీష్ ఒరిజినల్‌తో పాటు హిందీ ఆడియో కూడా అందుబాటులో ఉంది. తెలుగులో ఆడియో మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు. డొచ్చు.

Advertisement

Read Also: మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా

Tags

Related News

5 భాషలలో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

మనుషుల్లా కనిపించే రెప్లికెంట్స్‌… తెలుగులో ఓటీటీలోకి వచ్చిన ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్

తోడు కావాలంటూ బుట్ట బొమ్మ తో ప్రేమ పెళ్లి… ఇదెక్కడి విచిత్రమైన కథరా బాబూ

మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా

జూనియర్‌తో పరిచయం… సీనియర్‌తో ఆ పని… క్రేజీ కొరియన్ ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన వస్తువు… చరిత్రనే మార్చే రహస్యం… ట్విస్టులతో మతిపోగొట్టే కామెడీ మిస్టరీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ ఎంట్రీ.. ‘ఇది నా అడ్డా’ అంటూ చిరంజీవి రచ్చ!

Big Stories

Advertisement
×