E-Paper
Advertisement

5 భాషలలో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

5 భాషలలో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’.. అఫీషియల్ అనౌన్స్మెంట్!
Advertisement

Garividi Lakshmi Movie:2012లో ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలతో తన కెరియర్ మొదలుపెట్టిన ఆనంది.. నాయక్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్ ఇలా పలు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. జాంబిరెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఆనంది ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా గరివిడి లక్ష్మి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఐదు భాషలలో ఓటీటీ స్ట్రీమింగ్..

ఆనంది , రాగ్ మయూర్ జంటగా వీ.కె.నరేష్, రాశి, శరణ్య, అంకిత కొయ్య ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గరివిడి లక్ష్మి. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్మూ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?..

Advertisement

ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈనెల 26న అనగా రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

also read:నెటిజన్ ప్రపోజల్ కి పడిపోయిన మాధురీ రాథోడ్!

గరివిడి లక్ష్మి సినిమా స్టోరీ..

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతంలో పుట్టిన కళాకారిణి జీవిత కథ ఈ చిత్రం. దేవుడమ్మ (రాశి), తాత నాయుడులకు పుట్టిన గారాల పట్టి విజయలక్ష్మి (ఆనంది). చదువు రాకపోయినా.. ఒక్కసారి వింటే చాలు ఆ విషయాన్ని ఇట్టే పట్టేసే ప్రతిభ ఆమె సొంతం. చిన్నప్పటినుండే కళలపై ఆసక్తి ఉన్న విజయలక్ష్మి జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. పలు కారణాలతో భర్తకు దూరమైన దేవుడమ్మ ఆమెకు అన్ని తానే అయి పెంచుతూ ఉంటుంది. అయితే లక్ష్మికి 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆ పెళ్లి ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? లక్ష్మీ జానపద కళల వైపు అడుగులు వేయడానికి కారణమేమిటి ?బుర్రకథ నేర్చుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఏంటి? గరివిడి లక్ష్మిగా ఆమెకు ఎలా గుర్తింపు లభించింది? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే మొత్తానికైతే గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటిటిలో ఇంకెంత ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

జాబ్ మారుతున్నారా ? పీఎఫ్ విషయంలో అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే

మనుషుల్లా కనిపించే రెప్లికెంట్స్‌… తెలుగులో ఓటీటీలోకి వచ్చిన ఫ్యూచరిస్టిక్ సైఫై థ్రిల్లర్

తోడు కావాలంటూ బుట్ట బొమ్మ తో ప్రేమ పెళ్లి… ఇదెక్కడి విచిత్రమైన కథరా బాబూ

మందలించిందని తల్లికి పిల్లలను దూరం చేసే ప్రభుత్వం… వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన లీగల్ డ్రామా

జూనియర్‌తో పరిచయం… సీనియర్‌తో ఆ పని… క్రేజీ కొరియన్ ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన వస్తువు… చరిత్రనే మార్చే రహస్యం… ట్విస్టులతో మతిపోగొట్టే కామెడీ మిస్టరీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ ఎంట్రీ.. ‘ఇది నా అడ్డా’ అంటూ చిరంజీవి రచ్చ!

Big Stories

Advertisement
×