BigTV English

Vettaiyan : ఓటిటిలోకి రజినీకాంత్ ‘వేట్టయాన్’…. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

Vettaiyan : ఓటిటిలోకి రజినీకాంత్ ‘వేట్టయాన్’…. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘వేట్టయాన్’. ఈ మూవీ ఈ రోజు తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే రజనీకాంత్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకుంటుండగా, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు. అంతేకాకుండా ఈ సినిమాను తమిళ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు అనే వివాదం సినిమా అడ్వాన్స్ బుకింగ్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. ఫలితంగా ‘వేట్టయాన్’ మూవీ అడ్వాన్స్ సేల్స్ తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఉన్నాయి. పైగా సినిమాకు కంప్లీట్ గా నెగిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘వేట్టయాన్’ మూవీ ఓటిటి రిలీజ్ ఎప్పుడు? అనే విషయాన్ని ఆరా తీయడం మొదలుపెట్టారు సూపర్ స్టార్ అభిమానులు. మరి ఈ సినిమా ఏ ఓటిటిలో, ఎప్పుడు రిలీజ్ కాబోతుందో తెలుసుకుందాం పదండి.


ఆ ఓటీటీ చేతికే ‘వేట్టయాన్’ రైట్స్ 

‘జై భీమ్’ మూవీతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయాన్ : ది హంటర్’ మూవీ అక్టోబర్ 10న దసరా కానుకగా థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను దాదాపు 140 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఇది రజనీకాంత్ కు 170వ సినిమా. అయితే సినిమా రిలీజ్ కి ముందే పలు వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా నెగిటివిటీని కూడా తెచ్చుకుంది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగడంతో, దెబ్బకు దిగొచ్చిన లైకా ప్రొడక్షన్స్ తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్ దొరకపోవడం వల్లే పాన్ ఇండియా వైడ్ గా ‘వేట్టయాన్’ అనే టైటిల్ తో రిలీజ్ చేశామని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలుగు మూవీ లవర్స్ కోపం చాలా రాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే నెగిటివ్ టాక్ తో ఇబ్బందులు పడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే వేట మూవీకి సంబంధించిన ఓటిటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ‘వేట్టయాన్’ ఓటీటీ రైట్స్ ను రికార్డు ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.


ఓటీటీలో ఎప్పుడంటే?

ఈ మూవీ సాటిలైట్ రైట్స్ ను సన్ టివి 65 కోట్లకు దక్కించుకోగా, ఓటీటీ అండ్ సాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి దాదాపు 155 కోట్ల డీల్ జరిగినట్టుగా టాక్ నడుస్తోంది. రజనీకాంత్ కు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో వేటాయం సినిమాకు డీల్ కుదిరింది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో తప్పటడుగు వేసినట్టుగానే అనిపిస్తోంది. ఇదిలా ఉండగా సినిమా ఓటిటిలోకి ఎప్పుడు వస్తుంది అంటే దీపావళి కానుకగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా దీనిపై అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ డిజాస్టర్ టాక్ తో ఈ సినిమా థియేటర్లలో ఎక్కువ కాలం రన్ అయ్యే ఛాన్స్ లేదు.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×