BigTV English
Advertisement

OTT Movie : ఆ ఇంట్లో రెంట్ కు అడుగు పెట్టడం అంటే నరకంలోకి వెళ్ళడమే… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆ ఇంట్లో రెంట్ కు అడుగు పెట్టడం అంటే నరకంలోకి వెళ్ళడమే… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా షార్ట్ ఫిల్మ్ లు, రీల్స్ చేసుకుంటూ బతికేస్తున్నారు యూత్. తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతోంది. వీటిని తీయడానికి ఒక్క స్మార్ట్ ఫోన్ సరిపోవడంతో, కుప్పలు తెప్పలుగా షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. టాలెంట్ చూపించి, ఏదో ఒక అవకాశం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే  షార్ట్ ఫిల్మ్ హారర్ జోనర్ లో వచ్చింది. అరగంట నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ క్రేజీ సీన్స్ తో నడుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఆన్నా అనే యువతి కొన్ని కారణాలతో, తన ప్రియుడు డేనియల్‌తో విడిపోతుంది. తర్వాత వియన్నాలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వస్తుంది. అద్దె ఇంటి కోసం ఆమె వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఒక ఏజెంట్, ఒక అపార్ట్‌మెంట్ ను చూపిస్తాడు. అందులో ఒక వృద్ధురాలు కంగారూపడుతూ ఉంటుంది. ఆ ఇంటిని ఎంత త్వరగా అయితే, అంత త్వరగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇక ఆన్నా అందులోకి వస్తానని చెప్పడంతో, ఆ ముసలామే ఊపిరి పీల్చుకుంటుంది. వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఆన్నా అందులోకి దిగినాక, ఆ ఇళ్ళు మొదట సౌకర్యవంతంగా కనిపిస్తుంది. అయితే ఎంతగా క్లీన్ చేసినా, మళ్ళీ దుమ్ముతో ఆ ఇళ్ళు నిండిపోతూ ఉంటుంది. ఈ అపార్ట్‌మెంట్ సాధారణమైనది కాదు, ఏదో శక్తి ఇందులో ఉందని ఆన్నా అనుమానిస్తుంది.


ఇందులో ఎవరైతే నివసిస్తూ ఉంటరో, వాళ్ళ యవ్వన శక్తిని తీసుకుంటూ ఉంటుంది అందులో ఉన్న దుష్ట శక్తి. ఆన్నా ఈ అపార్ట్‌మెంట్‌లో ఉండటం వల్ల వేగంగా వృద్ధాప్యం వస్తుందని తొందర్లోనే గ్రహిస్తుంది. ఆమె ముఖంలో కూడా చాలా మార్పులు వస్తాయి. అక్కడినుంచి వెళ్లిపోవాలి అనుకుంటే, మరెవరైనా ఆ ఇంట్లోకి అద్దెకు దిగాలి. అగ్రిమెంట్ పేపర్లో అలానే రాసుకుని ఉంటారు. ఈ క్రమంలో ఈ అపార్ట్‌మెంట్ దాగి ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది ఆన్నా. దాని శక్తికి వ్యతిరేకంగా తన యవ్వనాన్ని కాపాడుకోవడానికి కూడా తపిస్తుంది. చివరికి అన్నా ఆ అపార్ట్మెంట్ నుంచి బయటపడుతుందా ? అందులో ఉన్న దుష్ట శక్తి ఎవరు ? ఎందుకు ఆ దెయ్యం యవ్వనాన్ని తీసుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి నుకుంటే, ఈ హారర్ కామెడీ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : అమ్మాయిని వేటాడే ముసుగు మనిషి… ఈ సైకో కిల్లర్ క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్

యూట్యూబ్ (Youtube) లో

ఈ హారర్ కామెడీ షార్ట్ ఫిల్మ్ పేరు ‘వియెన్నా వైట్స్ ఫర్ యు’ (Vienna Waits for You). 2012 లో విడుదలైన ఈ సినిమాకి డొమినిక్ హార్టల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ ఆన్నా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో ఈ షార్ట్ ఫిల్మ్ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

Big Stories

×