OTT Movie : సైన్స్-ఫిక్షన్ సినిమాలు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాలు ఊహకందని సన్నివేశాలతో ఊపిరాడకుండా చేస్తుంటాయి. ఇటువంటి సినిమాలు ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఉంటాయి. ఓటీటీలో సైన్స్-ఫిక్షన్ సినిమాలకు కొదవ లేదు. రకరకాల స్టోరీలతో ఇటువంటి ఇనిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, భూమికి ఒక పెను ప్రమాదం రావాడానికి సిద్ధంగా ఉంటుంది. ఆర్కిటిక్ లాగా భూమి మొత్తం మారిపోయే సూచనలు కనబడతాయి. సినిమా చివరివరకూ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
జాక్ టేట్ ఆస్ట్రేలియాలో ఒక భౌతిక శాస్త్రవేత్తగా పని చేస్తుంటాడు. అతని సంస్థకు చెందిన సిబ్బంది అందరూ, ఆర్కిటిక్ లోని ఒక నౌకలో గడ్డకట్టి చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి జాక్ ఆశ్చర్యపోతాడు. ఈ సంఘటనలో అతని సహోద్యోగి అలెక్స్ కూడా చనిపోతాడు. జాక్ దీని వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. సౌర గ్రహణంలో మార్పుల కారణంగా ఓజోన్ పొరలో ఒక హోల్ ఏర్పడిందని, దీని వల్ల దక్షిణ ధ్రువం పైన భారీ ఐస్ ఫాగ్ ఏర్పడిందని అసలు విషయం కనిపెడతాడు జాక్. ఈ ఐస్ ఫాగ్ వేగంగా విస్తరిస్తూ, భూమిని కొత్త ఐస్ ఏజ్‌లోకి నెట్టివేసే ప్రమాదాన్ని సృష్టిస్తుందని తెలుసుకుంటాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి జాక్ తీవ్రంగా శ్రమిస్తుంటాడు.
మరోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు. అదే సమయంలో, జాక్ భార్య అతనితో విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె అతని ఉద్యోగం కారణంగా, ఎప్పుడూ ఊర్లు మారడానికే సమయం సరిపోతూ ఉంటుంది. అతనితో గడపడానికి సమయం కూడా ఉండదు. దీని కారణంగానే జాక్ భార్య విడాకులకు ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి జాక్ ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఏం చేస్తాడు ? తన కుటుంబాన్ని కాపాడుకుంటాడా ? ఈ జంట విడాకులు తీసుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఆస్ట్రేలియన్ సైన్స్-ఫిక్షన్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : నట్ట నడి సముద్రంలో జైలు… ఈ క్రిమినల్స్ వేసిన మాస్టర్ ఎస్కేప్ ప్లాన్ కు దిమ్మ తిరగాల్సిందే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఆస్ట్రేలియన్ సైన్స్-ఫిక్షన్ మూవీ పేరు ‘ఆర్కిటిక్ బ్లాస్ట్’ (Arctic Blast). 2010 లో వచ్చిన ఈ మూవీకి బ్రియాన్ ట్రెంచర్డ్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీలో భూమి ఐస్ తో కప్పబడిపోవడానికి, కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ తరువాత ఊహకందని పరిణామాలు ఎదురౌతాయి. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.