Kingdom film OTT :రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా తాజాగా రాబోతున్న చిత్రం కింగ్డమ్(King Dom). ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా మే 30వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ డిలే కారణంగా ఆగస్టు 1న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఆరోజు పంచాంగరీత్య అష్టమి కావడంతో ఒకరోజు ముందుగానే అంటే జూలై 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఓటీటీలోకి రాబోతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు అంటూ ఆ వార్తల సారాంశం. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో రౌడీ హీరో హంగామా చూద్దామని ఎదురుచూసిన వారికి ఇది అత్యంత బాధాకర వార్త అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పాన్ ఇండియా వైడ్ గా కింగ్డమ్..
జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న కింగ్డం. ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక దీంతోనే సినిమా పై సగం హైప్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇకపోతే జూలై 31వ తేదీన ఈ సినిమాను తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
హిందీ విడుదల ఆపేసిన మేకర్స్..
కానీ ఇప్పుడు హిందీ విడుదల ఆపివేస్తామని మేకర్స్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఒకరకంగా చెప్పాలి అంటే ఈ నిర్ణయం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్లో భారీ హంగులతో ప్రమోషన్స్ చేసి.. సినిమాను అక్కడి ఆడియన్స్లోకి తీసుకెళ్లడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సినిమాను విడుదల చేస్తే ఒకవేళ ఆ సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించకపోతే.. పోస్టర్ కోసం పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావు. అందుకే ఆ రిస్క్ చేయడం ఇష్టం లేక నాగ వంశీ ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇక సౌత్లో థియేటర్ లో ఫుల్ ముగిసిన తర్వాతనే.. ఈ సినిమాను అక్కడ హిందీలో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ నిర్ణయం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ALSO READ:Samantha: డైరెక్టర్‌తో సమంత రిలేషన్.. పోస్ట్ పై రాజ్ భార్య రియాక్షన్!