BigTV English

Summer Hair Care: ఎండాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే.. వీటిని వాడాల్సిందే !

Summer Hair Care: ఎండాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే.. వీటిని వాడాల్సిందే !

Summer Hair Care: సమ్మర్‌లో బలమైన సూర్యకాంతి, చెమట, తేమ జుట్టు , చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఈ సీజన్‌లో జుట్టు దెబ్బతినకుండా కాపాడుకోవడానికి DIY హెయిర్ మాస్క్ వాడటం మంచిది. ఇవి జుట్టుకు పోషణనిచ్చి బలంగా ,మెరిసేలా చేస్తాయి. హెయిర్ మాస్క్‌ల సహాయంతో మీరు వేసవిలో కూడా మీ జుట్టు , చర్మాన్ని ఆరోగ్యంగా , అందంగా ఉంచుకోవచ్చు.


వేసవిలో చెమట, అనేక ఇతర కారణాల వల్ల జుట్టు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో జుట్టు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి కారణంగా.. జుట్టు మూలాలు కూడా బలహీనపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలడం సమస్య మొదలవుతుంది. తేమ కారణంగా.. ఈ సీజన్‌లో తల దురద, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. ఈ వేసవి కాలంలో మీరు మీ జుట్టు మెరుపును కోల్పోకూడదనుకుంటే , దానిని సిల్కీగా , మెరిసేలా ఉంచాలనుకుంటే.. మీ జుట్టును వేడి నుండి రక్షించుకోవడానికి మీరు కొన్ని ప్రత్యేకమైన DIY హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకోవాలి.ఇవి వేసవిలో మీ జుట్టు మెరుపును పెంచి, రాలకుండా చేస్తాయి.

1. మెంతులు ,పెరుగు హెయిర్ మాస్క్:
కావలసినవి:
మెంతులు- ½ కప్పు
పెరుగు- 4 టేబుల్ స్పూన్లు


ఎలా తయారు చేయాలి ?
హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి.. ముందుగా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు నానబెట్టిన మెంతులను మెత్తగా చేసుకోవాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ లో ఒక చెంచా పెరుగు వేసి మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరినివ్వండి. తర్వాత తలస్నానం చేయండి. ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకసారి వాడినా చాలు మీ తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా చుండ్రు, దురద తొలగిపోతాయి. ఇదే కాకుండా, జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

2. అరటిపండు, తేనె హెయిర్ మాస్క్:
కావలసినవి:
అరటిపండ్లు: 2
తేనె – 2 టేబుల్ స్పూన్లు

ఎలా తయారు చేయాలి ?
హెయిర్ మాస్క్ తయారు చేయడానికి.. ముందుగా పండిన అరటిపండును బాగా మెత్తగా చేయాలి.. దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపండి. తయారుచేసిన ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు మీ హెయిర్ మాస్క్ అప్లై చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

Also Read: జుట్టు పలచబడిందా ? అయితే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

ఎలా అప్లై చేయాలి:
మీరు తయారుచేసిన అరటిపండు, తేనె హెయిర్ మాస్క్‌ను మీ జుట్టుకు అప్లై చేయండి . ఇది తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. హెయిర్ మాస్క్ సరిగ్గా అప్లై చేసిన తర్వాత.. జుట్టు మీద 20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత.. మీ జుట్టును నీటితో శుభ్రం చేయండి. దీనివల్ల జుట్టుకు ఎటువంటి హాని జరగదు. ఈ చల్లని హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల మీ తలకు, జుట్టుకు పోషణ లభిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.

 

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×