BigTV English
Advertisement

OTT Movie : కూతురి కోసం పక్క ఎక్కే తల్లి… అమ్మాయిలనే టార్గెట్ చేసే సైకో… పిచ్చెక్కించే క్లైమాక్స్

OTT Movie : కూతురి కోసం పక్క ఎక్కే తల్లి… అమ్మాయిలనే టార్గెట్ చేసే సైకో… పిచ్చెక్కించే  క్లైమాక్స్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. మంచి కథలతో ముందుకు వస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను దారుణంగా చంపుతుంటాడు. ఇతని చేతిలోకి ఒక అమాయకురాలు చిక్కుతుంది. మూవీ చివరి వరకు ట్విస్టులతో అదరగొడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వైట్ రోజ్’ (White rose). 2024లో విడుదలైన ఈ తమిళ థ్రిల్లర్ మూవీకి కె రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆనంది, R. K. సురేష్ నటించారు. దీనిని పూంబరై మురుగన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై N రంజని నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

దివ్య తన కూతురిని చదివిస్తూ సంతోషంగా ఉంటుంది. భర్త అష్రఫ్ ఫారిన్ నుంచి ఇండియాకి వస్తాడు. కూతురిని చాలా ప్రేమ చేస్తాడు. అదే రోజు దివ్య బర్డే ఉంటుంది. తనకు విషెస్ చెప్పలేదని దివ్య బాధపడుతుంది. డిన్నర్ కి వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్తాడు అష్రఫ్. హోటల్లో ఆమెకు బర్తడే పార్టీ సర్ప్రైజ్ చేస్తాడు. దివ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి రిటర్న్ అవుతుండగా, పోలీసులు ఒక కూంబింగ్ ఆపరేషన్ చేస్తుంటారు. పోలీసులు పొరపాటున అష్రఫ్ ని కాల్చడంతో, అతడు అక్కడికక్కడే చనిపోతాడు. దివ్య బాధ మాటల్లో చెప్పడానికి లేకుండా ఉంటుంది. అయితే పోలీసులు అతన్ని కూడా టెర్రరిస్ట్ అని చెప్తారు. ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిస్తే పోలీసులు చిక్కుల్లో పడతారు. భర్త చనిపోయి బాధపడుతున్న దివ్యకి, అతన్ని తీవ్రవాదిగా చూపించడం ఇంకా బాధిస్తుంది.

ఈ క్రమంలోనే దివ్య ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తినటానికి కూడా డబ్బులు లేకుండా ఉంటాయి. అదే ప్రాంతంలో ఒక సైకో కిల్లర్ ఆడవాళ్ళని దారుణంగా చంపుతుంటాడు.  మరోవైపు భర్త అప్పు చేశారని తన కూతుర్ని బంధిస్తాడు వడ్డీ వ్యాపారి. ఈ బాధల నుండి బయటకు రావడానికి, స్నేహితురాలి ద్వారా, కాల్ గర్ల్ గా పని చేయాలనుకుంటుంది దివ్య. ఆమెని ఒక అబ్బాయి బుక్ చేసుకుంటాడు. అతడు ఎవరో కాదు అమ్మాయిలని చంపే సైకో. అతని ఇంటికి వెళ్ళిన దివ్యకి, అతడు సైకో అని తెలిసిపోతుంది. చివరికి దివ్య ఆ సైకో నుంచి తప్పించుకుంటుందా? పోలీసులు ఆమెకు సాయం చేస్తారా? తన కూతురు వడ్డీ వ్యాపారి నుంచి బయట పడుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వైట్ రోజ్’ (White rose) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడండి.

Related News

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

Big Stories

×