BigTV English

Babu Mohan : బిగ్ బాస్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్..బాబోయ్ బూతులే..

Babu Mohan : బిగ్ బాస్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్..బాబోయ్ బూతులే..

Babu Mohan : టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒకప్పటి సినిమాలు ఎంత బాగుండేవి.. కుటుంబ విలువల గురించి ఎంతో చక్కగా చూపించేవారు. ఏదైనా కూడా గుండెల్నిపిండేసే కథలు. అయితే ఆ సినిమాలు ఈరోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు. ప్రేమలు, విలువలు అనే అంశాలు ఈరోజుల్లో వస్తున్నా సినిమాల్లో వెతికినా కనిపించడం లేదు. ఈరోజుల్లోని సినిమాల తీరు గురించి గతంలో చాలా మంది పలు ఇంటర్వ్యూ లలో మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ ( Babu Mohan ) ఎన్నో విషయాలను పంచుకున్నారు.. ఆయన మనసులోని మాటలను బయట పెట్టారు. అంతేకాదు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడం తో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆయన ఏమన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం..


బాబు మోహన్ ఇంటర్వ్యూ.. 

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు హాస్యనటుడు బాబు మోహన్.. ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఎంతో న్యాచురల్ గా ఆయన పర్ఫామెన్స్ ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ అయ్యారు. అయితే ఈమధ్య తెలుగులో సీనియర్ నటులు ఎంతోమంది సినిమాల్లో బిజీగా ఉన్నారు కానీ బాబు మోహన్ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎంత బిజీ ఉన్నా పలు చానల్స్ కి మాత్రం ఇంటర్వ్యూ ఇస్తూ తన మనసులోని భావాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలకి అప్పుడు సినిమాలకి తేడాలు చాలా ఉన్నాయని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ బయట పెట్టారు. అప్పట్లో డైరెక్టర్ తన అసిస్టెంట్లు వస్తున్నారంటే అదొక ఇది అలా ఉండేది కానీ ఇప్పుడు ఏందో అందరూ వచ్చామా  అన్నట్లు ఉంటారు అని ఆయన అన్నారు. ఇప్పుడు సినిమాలో అవకాశాలు వస్తే చేస్తారంటే ఈమధ్య వచ్చే సినిమాలు నాకు పెద్దగా నచ్చలేదు అందుకే సినిమాలు చేయాలని అనిపించలేదని ఆయన అన్నారు. ఇక టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read : నాగ చైతన్య మూవీ నయా రికార్డు.. 500 కోట్లు రాబడుతుంది..?

బిగ్ బాస్ పై బాబు మోహన్ బూతులు.. 

టాప్ రియాల్టీ షో కాదు దూసుకుపోతున్న బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ షో గురించి కొందరు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదొక షో నా మొత్తం బూతుల్ని చూపిస్తున్నారు అన్నట్లు అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈయన బిగ్ బాస్ ఒక చెత్త. మన కల్చర్ ను పాడు చేస్తున్నారు అంటూ మండి పడ్డారు. అందర్నీ ఒకచోట తీసుకొచ్చి ఏం చెప్పాలనుకున్నారో అది మర్చిపోయి వాళ్ళమధ్య రొమాన్స్ ఆ తర్వాత ఇంకేదో ఇంకేదో అన్ని కెమెరాలు ముందు ఇజ్జత్ ని తీస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు అందుకే నాకు ఆ షో నచ్చదు నేను ఇంతవరకు చూడలేదు అని బాబు మోహన్ సంచన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్లు ఆయనను సమర్దిస్తున్నారు. మరికొందరు ఆయన మాట పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×