OTT Movie : కొన్ని సైకో కిల్లర్ సినిమాలు క్యాజువల్ గా చూస్తే, కల్లోకి కూడా వచ్చి భయపెట్టేంత దారుణంగా ఉంటాయి. అలాంటి మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీని చూశారంటే వారం దాకా మైండ్ లో నుంచి పోదు. అంత భయంకరమైన ఎఫెక్ట్ చూపించే ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘విన్నీ-ది-పూ: బ్లడ్ అండ్ హనీ’ (Winnie-the-Pooh: Blood and Honey) అనే ఈ మూవీ 2023లో విడుదలైన బ్రిటిష్ ఇండిపెండెంట్ స్లాషర్ హారర్ చిత్రం. దీనికి రీస్ ఫ్రేక్-వాటర్‌ఫీల్డ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఈ చిత్రం 1926లో పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన విన్నీ-ది-పూ అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో విన్నీ-ది-పూ (క్రెయిగ్ డేవిడ్ డౌసెట్), పిగ్లెట్ (క్రిస్ కార్డెల్) ప్రధాన పాత్రధారులుగా, అంబర్ డోయిగ్-థోర్న్, నికోలాయ్ లియోన్, మరియా టేలర్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో రెంట్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
క్రిస్టోఫర్ రాబిన్ హండ్రెడ్ ఎకర్ వుడ్‌లో విన్నీ-ది-పూ, పిగ్లెట్, ఈయోర్, రాబిట్, ఔల్ అనే మానవరూప జీవులతో స్నేహం చేస్తాడు. క్రిస్టోఫర్ చిన్నప్పటి నుంచే వీటికి ఆహారం పెడుతూ, ఫ్రెండ్ గా మారిపోతాడు. అయితే క్రిస్టోఫర్ పెరిగి కాలేజీకి వెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆహారం లేక, కఠినమైన శీతాకాలంలో ఈ జీవులు తీవ్రమైన ఆకలితో బాధపడతాయి. ఈ ఆకలి వారిని క్రూరమైన జంతువులుగా మార్చడంతో… తమలో ఒకరైన ఈయోర్ ను తినేస్తారు. తరువాత దీనికి కారణమైన క్రిస్టోఫర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆగ్రహంతో రగిలిపోతారు.
ఐదు సంవత్సరాల తర్వాత, క్రిస్టోఫర్ రాబిన్ తనకు కాబోయే భార్య మేరీతో కలిసి హండ్రెడ్ ఎకర్ వుడ్‌కు తిరిగి వస్తాడు. తన పాత స్నేహితులను కలవాలనే ఆశతో అక్కడికి వచ్చిన అతను చూసిన ఆ దృశ్యం భయంకరంగా ఉంటుంది. మేరీ హెచ్చరికలను పట్టించుకోకుండా క్రిస్టోఫర్ అడవిలోకి వెళతాడు. అక్కడ పిగ్లెట్ అతనిపై దాడి చేసి, మేరీని గొలుసుతో గొంతు బిగించి చంపేస్తాడు. క్రిస్టోఫర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పూ అతన్ని పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లి, అక్కడే బంధిస్తాడు.
Read also : ఇక్కడ టెస్ట్ ఫెయిల్ అయితే పిల్లలకు డైరెక్ట్ గా ఉరే… కలలో ఊహించని కథరా సామీ ఇది
ఇదే సమయంలో కాలేజ్ పిల్లలు మరియా, జెస్సికా, ఆలిస్, జోయ్, లారా… హండ్రెడ్ ఎకర్ వుడ్ సమీపంలో ఒక క్యాబిన్ లో విహార యాత్రకు వస్తారు. అక్కడ సరదాగా గడపడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఈ మానవ రూపంలో ఉన్న మృగాలు ఒక్కొక్కరినీ వేటాడటం ప్రారంభిస్తారు. కత్తులు, హామర్‌లు, గొలుసులు వంటి ఆయుధాలను ఉపయోగిస్తూ, భయంకరంగా హత్యలు చేస్తారు. మరి క్రిస్టోఫర్ వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు? మృగాలుగా మారిన పాత ఫ్రెండ్స్ ను ఏం చేశాడు? కాలేజ్ పిల్లలు ఎవరైనా బతికి బయట పడ్డారా? అనే విషయాన్ని సినిమాను చూసి తెలుసుకోవాలి.