BigTV English

OTT Movie : ఇక్కడ టెస్ట్ ఫెయిల్ అయితే పిల్లలకు డైరెక్ట్ గా ఉరే… కలలో ఊహించని కథరా సామీ ఇది

OTT Movie : ఇక్కడ టెస్ట్ ఫెయిల్ అయితే పిల్లలకు డైరెక్ట్ గా ఉరే… కలలో ఊహించని కథరా సామీ ఇది

OTT Movie : టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు ఇలా వస్తాయో లేదో చావు కబురు చల్లగా అందుతుంది. ఓవైపు పేరెంట్స్, మరోవైపు టీచర్స్ పెట్టె ప్రెజర్ కు పిల్లలు మెంటల్ స్ట్రెస్ లో జీవితాలను బలి తీసుకుంటారు. కానీ ఈ మూవీ ఇంకాస్త అడ్వాన్స్ గా ఉంటుంది. సాధారణంగా టెస్ట్ లో ఫెయిల్ అయితే మళ్ళీ రాయడం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఫెయిల్ అయితే డైరెక్ట్ గా నరకానికే పంపిస్తారు. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


జనాభా నియంత్రణకు చావే సొల్యూషనా?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘ది థిన్నింగ్’ (The Thinning). మైఖేల్ జె. గల్లాఘర్ దర్శకత్వం వహించిన ఈ సోషల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ ఫిల్మ్ 2016 లో రిలీజ్ అయ్యింది. ఇందులో లోగన్ పాల్ (బ్లేక్ రెడ్డింగ్), పేటన్ లిస్ట్ (లైనా మైఖేల్స్), లియా మేరీ జాన్సన్, కాలమ్ వర్తీ, స్టేసీ డాష్ నటించారు. ఈ చిత్రంలో కథ 2039లో ఒక డిస్టోపియన్ భవిష్యత్తుగా నడుస్తుంది. అక్కడ జనాభా నియంత్రణ కోసం పాటించే కఠినమైన చర్యలు చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే. ‘ది థిన్నింగ్’ మూవీ యూట్యూబ్ ప్రీమియం (Youtube Premium)లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా రెంట్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే…
2039లో భూమిపై జనాభా అధికం కావడం వల్ల, ఐక్యరాష్ట్ర సమితి అన్ని దేశాలు తమ జనాభాను సంవత్సరానికి 5% తగ్గించాలని ఆదేశిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి “10-241” లేదా “ది థిన్నింగ్” అనే స్టాండర్డైజ్డ్ టెస్ట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ పరీక్షలో కిండర్‌గార్టెన్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొంటారు. ఇందులో ఫెయిల్ అయిన వారిని ఏకంగా ఉరితీస్తారు. సమాజంలో తెలివైన వాళ్ళే ఉండాలన్న ఉద్దేశంతో ఈ పద్దతిని ఫాలో అవుతారు.


బ్లేక్ రెడ్డింగ్ (లోగన్ పాల్), టెక్సాస్ గవర్నర్ డీన్ రెడ్డింగ్ కుమారుడు. తన స్నేహితురాలు ఎల్లీ హార్పర్ తో డేటింగ్‌లో ఉంటాడు. వీరిద్దరూ పరీక్ష కోసం చదవరు. అయినప్పటికీ బ్లేక్ పాస్ అవుతాడు, కానీ ఎల్లీ ఫెయిల్ అవుతుంది. బ్లేక్ తన తండ్రిని ఎల్లీని కాపాడమని వేడుకుంటాడు, కానీ గవర్నర్ నిరాకరిస్తాడు. దీంతో ఎల్లీని చంపేస్తారు.

ఒక సంవత్సరం తర్వాత బ్లేక్ తన చివరి పరీక్ష రోజున తండ్రిని పరీక్షించడానికి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ అవుతాడని వీడియోలో ప్రకటిస్తాడు. ఈ సమయంలో లైనా మైఖేల్స్ (పేటన్ లిస్ట్) అనే ఒక తెలివైన విద్యార్థి, తన చిన్న సోదరి కోరిన్‌ ను కాపాడటానికి పరీక్షలో గట్టిగా కష్టపడుతుంది. లైనా తన తల్లి మరణించడంతో కోరిన్‌ ను తనే చూసుకుంటోంది.

పరీక్ష సమయంలో లైనా సర్వర్ రూమ్‌లోకి చొరబడి, టెస్ట్ స్కోర్స్ షఫుల్ చేస్తున్నారని, దీనివల్ల పాస్ అయిన విద్యార్థులు కూడా చనిపోతున్నారని కనుగొంటుంది. ఈ కుంభకోణం వల్ల అస్సురు గ్లోబల్ అనే టెక్ కంపెనీకి లాభం చేకూరుతుందని తెలుస్తుంది. లైనా ఈ సమాచారాన్ని తన స్నేహితుడు కెల్లన్‌కు ఇస్తుంది. లైనా కెమెరాలో కంటికి చిక్కడంతో ఆమెను చంపడానికి తీసుకెళ్తారు. మరోవైపు బ్లేక్ ఒక గార్డు వేషంలో, ఫెయిల్ అయిన విద్యార్థులను విడిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను కూడా పట్టుబడతాడు. మరి బ్లేక్ ఎలా తప్పించుకున్నాడు? గవర్నర్ రెడ్డింగ్ పిల్లలకు చేస్తున్న అన్యాయం ఏంటి? గ్లోబల్ టెక్ కంపెనీకి, పిల్లలకు సంబంధం ఏంటి? చావు పేరుతో పిల్లలను ఏం చేస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావలంటే ఈ మూవీని డోంట్ మిస్.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×