OTT Movie : మనుషులు దయ్యాలకు భయపడతారో లేదో గాని, సైకో లకు మాత్రం బాగానే భయపడతారు. ఈ సైకోలు మనుషుల మధ్యనే ఉంటూ అరాచకాలు సృష్టిస్తారు. సైకో స్టోరీలతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, తండ్రి కొడుకులు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ స్లాషర్ హర్రర్ మూవీ పేరు ‘రాంగ్ టర్న్ 5 : బ్లడ్ లైన్స్’ (Wrong Turn 5: Bloodlines). దీనికి డెక్లాన్ ఓబ్రియన్ దర్శకత్వం వహించారు. ఇది ‘Wrong Turn’ సిరీస్‌లో ఐదవ పార్ట్ గా వచ్చింది. 2011 లో వచ్చిన ‘ Wrong Turn 4: Bloody Beginnings’ కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇందులో డగ్ బ్రాడ్లీ, కెమిల్లా ఆర్ఫ్వెడ్సన్, సైమన్ గింటీ, రాక్సాన్ మెకీ తదితరులు నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
వెస్ట్ వర్జీనియాలోని ఫెయిర్‌లేక్ అనే చిన్న పట్టణంలో, హాలోవీన్ సందర్భంగా ప్రసిద్ధమైన ‘మౌంటైన్ మ్యాన్ ఫెస్టివల్’ జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవానికి రంగురంగుల దుస్తులు ధరించిన జనం సంగీతం, వినోదం కోసం అక్కడికి వస్తారు. అదే సమయంలో, ఐదుగురు కాలేజీ స్నేహితులు బిల్లీ, క్రజ్, లిటా, గస్, జూలియన్ ఈ ఫెస్టివల్‌ను ఆస్వాదించడానికి ఫెయిర్‌లేక్‌కు వస్తారు. కానీ వారికి తెలియకుండానే, ఈ ప్రాంతంలో థ్రీ ఫింగర్, సా టూత్, వన్ ఐ అనే ముగ్గురు వికృత కన్నిబల్ సోదరులు తిరుగుతుంటారు. వీరికి వారి తండ్రి మేనార్డ్ ఓడెట్స్ సహాయం చేస్తాడు. ఈ తండ్రి, కొడుకులు మనుషులను దారుణంగా చంపుతుంటారు. మేనార్డ్ మొదట ఒక వార్తా రిపోర్టర్ ను హత్య చేస్తాడు. షెరీఫ్ కార్టర్ అనే పోలీస్ అతన్ని వెంబడిస్తుంది. ఈ సమయంలో, ఆ ఐదుగురు స్నేహితులు రోడ్డుపై మేనార్డ్‌ను అనుకోకుండా ఢీకొట్టడంతో అతను అరెస్ట్ అవుతాడు. అతన్ని షెరీఫ్ కార్టర్ జైలులో ఉంచుతుంది. అయితే నన్ను విడిపించడానికి నా కొడుకులు వస్తారని అమెను మేనార్డ్ హెచ్చరిస్తాడు.
ఆ రాత్రి ఈ ముగ్గురు కన్నిబల్స్ షెరీఫ్ స్టేషన్‌పై దాడి చేస్తారు. మేనార్డ్‌ను విడిపించి, అక్కడ ఉన్నవారిని చంపడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఫెస్టివల్ కు వచ్చిన గస్‌ను కన్నిబల్స్ బంధిస్తారు. అతని కాళ్లను విరగ్గొట్టి, షెరీఫ్ స్టేషన్ ముందు వదిలేస్తారు. షెరీఫ్ కార్టర్ అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ కన్నిబల్స్ వారి ట్రక్కుతో అతన్ని చంపేస్తారు. ఇంతలో బిల్లీ, జూలియన్, క్రజ్ కనిపించకుండా పోయిన గస్ ను వెతకడానికి బయటకు వెళ్తారు. కానీ వారు కూడా కన్నిబల్స్ చేతిలో చిక్కుకుంటారు. ఒక ఫుట్‌బాల్ మైదానంలో థ్రీ ఫింగర్ వారిని స్నోబ్లోవర్‌తో హత్య చేస్తాడు. ఆ తరువాత ఇదంతా చూసి షెరీఫ్ కార్టర్ బ్యాకప్ కోసం రేడియో ద్వారా సహాయం కోరుతుంది. కానీ ఎవరూ ఆమె సందేశాన్ని సీరియస్‌గా తీసుకోరు. చివరికి కన్నిబల్ చేతిలో షెరీఫ్ కార్టర్ కూడా బలి అవుతుందా ? ఆ మానవ మృగాలను పోలీసులు పట్టుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలంటే, ఈ అమెరికన్ స్లాషర్ హర్రర్ మూవీని చూడండి.