Pawan Kalyan Fan: రాజకీయాల్లోకి రాకముందు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగి పోయింది. ఎక్కడికి వెళ్లినా పవర్ స్టార్ ఫ్యాన్స్ కనిపిస్తారు. అయితే ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి కూడా ఆయన అభిమాని వచ్చాడు. ఎకంగా రక్తంతోనే చిత్రాన్ని గీసి పవన్ కళ్యాణ్‌సపై తనకున్న అభిమాన్నాన్ని చాటుకున్నాడు.
తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన పండ్రికి వెంకట హరి చరణ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని రక్తంతో వేశాడు. రాజమహేంద్రవరం జైల్ రోడ్ లో శుక్రవారం జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి ఆ పెయింటింగ్‌ని తీసుకొచ్చాడు.
ALSO READ: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం
దాన్ని రాష్ట్ర పర్యాటక, స్కృతిక, నిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసలకు అందజేశాడు. ఈ క్యాక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తారని అనుకున్నాని.. కానీ అయన రాకపోవడంతో పెయింటింగ్‌ని చూపించలేకపోయానని హరి చరణ్ తెలిపాడు. చిన్న తనం నుంచే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు రక్త దానం చేసినప్పుడు కొంత రక్తం తీసుకొని పెయింటింగ్ వేసినట్లు చెప్పాడు.
అయితే, ఎలాగైనా సరే ఆ పెయింటింగ్‌ని పవన్ కళ్యాణ్‌కి అందేలా చేస్తామని మంత్రి కందులు దుర్గేష్ హమీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఈ పెయింటింగ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.