Kajal Aggarwal at Satyabhama Movie Function: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
టాలీవుడ్ సీనియర్, యంగ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి తన అందంతో మెప్పింది.
ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను సైతం తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
స్టార్ నటిగా తన కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును మ్యారేజ్ చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆపై ఒక బాబుకు తల్లి అయి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
అయితే ఇటీవలే మళ్లీ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సినిమాలతో దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ భామ ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది.
ఈ మూవీ మే 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా.. క్యూట్‌గా కనిపించి చిరునవ్వుతో అభిమానుల మనసు దోచుకుంది.