కేరళలో విశిష్టంగా జరుపుకునే ఓణం పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి మలయాళ ముద్దుగుమ్మలు అంతా సిద్ధమయ్యారు. అందులో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఓణం సందర్భంగా తన స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.
అమ్మ చీర కట్టుకొని కొప్పులో పువ్వులు పెట్టుకొని సింపుల్‌గా అందరి మనసులను దోచేస్తోంది అనుపమ.
రింగుల జుట్టుతో, తనదైన యాక్టింగ్‌తో ఎప్పుడో అందరినీ తన బుట్టలో పడేసుకున్న అనుపమ.. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో కూడా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటుంది.
మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో యాక్టర్‌గా ప్రేక్షకులకు పరిచమయ్యింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా సౌత్ మొత్తం పెద్ద హిట్ కావడంతో తను తెలుగులో డెబ్యూ చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టలేదు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ.. ఆ..’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా తెలుగు తెరపై అడుగుపెట్టింది అనుపమ.
ఆ తర్వాత మలయాళ మూవీ ‘ప్రేమమ్’ను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేయగా.. అక్కడ పోషించిన పాత్రనే తెలుగులో మరోసారి పోషించి అందరినీ ఫిదా చేసింది.
ఎక్కువశాతం పక్కింటమ్మాయి పాత్రల్లో నటిస్తూ అందరికీ దగ్గరయిన అనుపమ.. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన ‘టిల్లు స్క్వేర్’తో తన రూటు మార్చేసింది.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా.. అందులో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదు.
డిఫరెంట్ జోనర్లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని ఫిక్స్ అయ్యానని ‘టిల్లు స్వ్వేర్’ ప్రమోషన్స్ సమయంలో ప్రత్యేకంగా ప్రకటించింది అనుపమ పరమేశ్వరన్.