Ashika Ranganath Photos | సంప్రదాయ డ్రెస్సులో పరిపూర్ణ అందమంటే అషికా రంగనాథ్ దే అని చెప్పాలి.
తెలుగు సినిమాల్లో సౌందర్య తరువాత సంప్రదాయ పాత్రలు చేసే హీరోయిన్ల దాదాపు లేరనే చెప్పాలి.
తాజాగా నా సామి రంగా సినిమాలో నాగార్జున సరసన నటించి అందరి చూపులు ఆకర్షించింది అషిక రంగనాథ్.
నా సామి రంగ సినిమాలో ఆషికా పల్లెపడుచు క్యారెక్టర్ లో చీర కట్టు, లంగా ఓణి వేసి సౌందర్యను గుర్తుకు చేసింది.
దాదాపు డజనుకు పైగా కన్నడ సినిమాల్లో నటించి 2023లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించి అమిగోస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అషికా.
కన్నడ సినిమాల్లో పేరు తెచ్చుకొని.. తెలుగులో అడుగు పెట్టిన అషికా.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే చాన్సు కొట్టేసింది.
చిరంజీవి విశ్వంభరలో ఈ కన్నడ అందగత్తె మంచి రోల్ కొట్టేసినట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.