BigTV English

Bhumika Chawla Birthday: విశాలమైన నేత్రాలు.. విచ్చుకున్న పూరేకులాంటి పెదవులు.. ఆమె అందం వర్ణనాతీతం

Bhumika Chawla Birthday: విశాలమైన నేత్రాలు.. విచ్చుకున్న పూరేకులాంటి పెదవులు.. ఆమె అందం వర్ణనాతీతం

Bhumika Chawla Birthday Special: భూమిక ఈ పేరు చెబితే ఇప్పటికీ ఖుషీ కానీ అభిమానులు ఉండరంటే అందులో అతిశయోక్తి లేదు.


యువకుడు సినిమాతో తెలుగు యువకుల గుండెల్ని కొల్లగొట్టి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.


భూమిక తెరపై కనిపిస్తే చాలు అభమానుల గుండెల్లో రోజాపూలు పూస్తాయి. భూమిక సినిమాలు యువతను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అంతలా ప్రేక్షకులను మనసుల్లో బలమైన స్థానాన్ని సంపాదించుంకుంది.

భూమిక 1978 ఆగష్టు 21న ఢిల్లీలో జన్మించింది. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా అవకాశాలు తలుపుతట్టాయి.

ముంబైలో యాడ్ ఫిలింస్, హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బంబ్స్ లో భూమిక తన కెరియర్ ను మొదలు పెట్టింది.

తెలుగులో రూపుదిద్దుకున్న యువకుడు సినిమాతో భూమిక తన సినీ కెరియర్ ని మొదలుపెట్టింది.

ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తో జోడీగా భూమిక నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో భూమికాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత భూమిక నటించిన ఒక్కడు, సింహాద్రి సినిమాలో ఒకే ఏడాది విడుదలై ఆ ఏడాది తెలుగులో అత్యధింకంగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో చోటు సంపాదించుకోలగాయి.

పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా తమిళంలో రీమేక్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళం సినమాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లోకూడా నటించి తన తనటనతో మంచి గుర్తింపు పొందింది.


భూమిక యువ హీరోలతోనే కాకుండా సీనియర్ హీరోలతోనూ నటించింది.

నాగార్జునతో స్నేహమంటే ఇదేరా, వెంకటేష్ తో వాసు, రవితేజతో నా ఆటోగ్రాఫ్, చిరంజీవితో జైచిరంజీవ, జగపతిబాబుతో స్వాగతం వంటి సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత యోగా టీచర్ ఠాకూర్ ను వివాహం చేసుకుంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహం తర్వాత కొంత కాలం సినీ ఇండస్ట్రీకి దూరమైన భూమిక సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది.

మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నటించింది. ఆ తర్వాత యూటర్న లో ప్రేక్షకులను బయపెట్టిన భూమిక నాగచైతన్య సవ్యసాచి సినిమాలో మరోసారి అలరించింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించి తెలుగు సినీరంగంలో అడుగుపెట్టి అన్ని భాషల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది భూమిక.

ఆమె మరిన్ని సినిమాల్లో అభిమానులను అలరించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం!

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×