Janhvi Kapoor: బాలీవుడ్‌లో ఫేమస్ హీరోయిన్ అయిపోయింది జాన్వీకపూర్. తక్కువ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఒక ప్రాజెక్టు తర్వాత మరొకటి చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో దర్శనమిస్తోంది.
ఈ మూవీకి సంబంధించి రిలీజైన సాంగ్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె డ్యాన్స్ చూసి యూత్ ఫిదా అయిపోయింది.
మూవీ రిలీజ్ కంటే ముందే ఆమెకు చాలామంది అభిమానులుగా మారిపోయారు.
సోమవారం సాయంత్రం ముంబైలో దేవర మూవీ ఈవెంట్‌కి సెట్స్ నుంచి నేరుగా వచ్చేసింది జాన్వీకపూర్.
ఆమెకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒకప్పుడు శ్రీదేవి కూతురుగా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. దేవర హిట్టయితే మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని భావిస్తోంది.
చీరకట్టులో కూడా జాన్వీకపూర్ మెరిసిపోతోంది. ఈ విషయంలో అతిలోక సుందరిని మరపిస్తోందని అంటున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్. జాన్వీకి సంబంధించిన నెట్టింట్లో ఫోటోలు వైరల్ అయ్యాయి.