Nisha Aggarwal Photos: టాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. తను హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత తన చెల్లెలు నిషా అగర్వాల్‌ను కూడా హీరోయిన్‌ను చేసింది.
కానీ కాజల్ అగర్వాల్‌లాగా నిషాకు అంత గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురయ్యాయి.
గుర్తింపు రాకపోవడంతో సినీ పరిశ్రమకు దూరమయ్యి ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ సోషల్ మీడియా ద్వారానే డబ్బులు సంపాదిస్తోంది నిషా అగర్వాల్.
అలాంటి నిషా తాజాగా సౌదీ అరేబియా ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ తను చూసిన ప్రాంతాలు, వాటి ప్రత్యేకతల గురించి సోషల్ మీడియాలో స్పెషల్‌గా పోస్ట్ షేర్ చేసింది.
సౌదీ అందానికి ఫ్లాట్ అయిన నిషా.. త్వరలోనే మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్తానని దానిపై తన ఇష్టాన్ని బయటపెట్టింది.
ఎడారిలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు తను స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఒక ఫోటోను కూడా షేర్ చేసింది నిషా.
సినీ పరిశ్రమలో తనకు అంతగా గుర్తింపు దక్కకపోయినా సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
తన ఫాలోవర్స్‌కు అప్పుడప్పుడు ఫ్యాషన్ టిప్స్, కుకింగ్ టిప్స్ కూడా అందిస్తుంటుంది నిషా అగర్వాల్.