BigTV English

Fenugreek Water Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా తాగాల్సిన డ్రింక్ ఏంటో తెలుసా ?

Fenugreek Water Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా తాగాల్సిన డ్రింక్ ఏంటో తెలుసా ?

Fenugreek Water Benefits: ప్రతి ఒక్కరి వంటగదిలోని దాదాపు మెంతులు ఉంటాయి. ఈ మెంతి గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. మెంతి గింజలే కాదు వీటితో తయారు చేసిన మెంతి నీరు కూడా అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.


రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే మెంతి గింజలలో అనేక ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో పాటు, మెంతి గింజల నీరు కూడా బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరి మెంతి గింజల నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి గింజల నీరు త్రాగితే కలిగే ప్రయోజనాలు..


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మెంతి గింజల నీరు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా తరుచుగా మెంతి గింజల నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం అవుతుంది.

డయాబెటిస్ నియంత్రణ:
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. మెంతులతో తయారు చేసిన నీటిని తాగడడం వల్ల శరీరం ద్వారా చక్కెర వినియోగం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి డ్రింక్ అనే చెప్పాలి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
మెంతి గింజల నీరు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. తరుచుగా మెంతుల నీరు త్రాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గడానికి ఇది ఎంత గానో ఉపయోగపడుతుంది. త్వరగా బరువు తగ్గాలని అనుకునేవారు తరుచుగా మెంతి వాటర్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

మెంతుల నీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుంతి. కొలెస్ట్రాల్ తగ్గడానికి తరుచుగా మెంతుల నీరు త్రాగాలి. ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది.

Also Read: వీటితో ఇంట్లోనే.. క్షణాల్లో దగ్గు మాయం

మెంతి గింజలను నీళ్లు తయారుచేసే విధానం:
ఒక టీ స్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే నీటిని వడపోసి మెంతి గింజలను పక్కన పెట్టుకోవాలి. ఖాళీ కడుపుతో ఇలా తయారు చేసిన మెంతి నీటిని తీసుకోవాలి. వీటి వల్ల అనేక లాభాలు ఉంటాయి. అనేక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో మెంతి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×