
Chandini Chowdary: నటి చాందిని చౌదరి మహేశ్ బాబు బ్రహ్మూత్సవం, నితిన్ నటించిన లై మూవీలో అతిథి పాత్రలు చేసింది.

ఆ తర్వాత చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా కలర్ ఫొటో.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన సమ్మతమే మూవీలో హీరోయిన్‌గా చేసింది.

ఇక ఇప్పుడు మరో నటుడు విశ్వక్ సేన్‌తో జోడీ కట్టింది.

ఇందులో భాగంగా ‘గామి’ మూవీలో విశ్వక్ సరసన హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

ఈ సినిమాలో చాందిని తన నటనతో అందరినీ ఆశ్చర్యపరచింది. మరి ఈ మూవీతో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి సినీ ఆఫర్లు వస్తాయా? లేదా ? అనేది చూడాలి.

ఇకపోతే ఈ గామి మూవీతో పాటు చాందిని మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా చేస్తోంది.

మొత్తానికి తెలుగులో పదేళ్ల ప్రయాణంలో చాందిని హీరోయిన్‌గా పది సినిమాలు చేసింది.