Hand Writing Tips: పిల్లల చేతివ్రాతను మెరుగుపరచడం చాలా ముఖ్యమైంది. మంచి చేతివ్రాత వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు చక్కగా వ్రాస్తే అది ఉపాధ్యాయులు చదవడానికి కూడా సులభంగా ఉంటుంది.
పిల్లల చేతివ్రాతలను మెరుగుపరచడానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. చేతి వ్రాత బాగుంటే పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అవకాశాలు కూడా ఉంటాయి.
సరైన పెన్సిల్ ఇవ్వండి:
నాణ్యత కలిగిన పేపర్‌తో పాటు, సరైన పెన్సిల్ వంటి తగిన స్టేషనరీని ఉపయోగించడం వల్ల పిల్లల చేతివ్రాతలో మెరుగుదల ఉంటుంది. వారు వ్రాసిన లక్షరాలు స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది.
పిల్లలకు ప్రతి రోజు కొంత చేతివ్రాతను ప్రాక్టీస్ చేయించండి. వారు వ్రాసిన తరువాత ఎలా వ్రాసారో చెక్ చేసి.. బాగా వ్రాస్తే పొగడండి. లేదంటే ఎలా వ్రాయాలో నేర్పించండి. ఎప్పటికప్పుడు వారు చేసే పొరపాట్లను తెలియజేయండి.
పెన్సిల్‌కు తగిన ఒత్తిడి:
మీ పిల్లల చేతివ్రాత సమయంలో పెన్సిల్ గట్టిగా పట్టుకుంటే వ్రాత అంత బాగా రాదు. అందుకే సులభంగా వ్రాసేలా వారికి అలవాటు చేయండి. ప్రాక్టీస్ కోసం మంచి పెన్సిల్‌లను ఉపయోగించండి.
చదవడానికి ఎక్కువ సమయం వెచ్చించండి:
చదవడం వల్ల పిల్లలు మంచి రచయితలుగా మారగలరని మీకు తెలుసా? చదవడం వల్ల పిల్లలు సరిగ్గా టైప్ చేసిన అక్షరాలు ఎలాంటి ఆకారంలో ఉన్నాయో గుర్తిస్తారు. ఫలితంగా అలాంటి ఆకారంలోనే అక్షరాలు రాయడానికి ఆసక్తి చూపిస్తారు.
తగిన షెడ్యూల్‌ను ఏర్పాటు చేయండి:
పిల్లలకు రెగ్యులర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించండి. అంతే కాకుండా ప్రతి రోజు ఒకే సమయాన్ని ఇందుకు కేటాయించండి. చేతివ్రాత సమయంలో పిల్లలు టీవీ, ఫోన్ లాంటివి చూడకుండా జాగ్రత్తలు తీసుకోండి.