Seize The Ship: గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఫేమస్ డైలాగ్స్ లో ఒకటి.. నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను. అక్షరాలా ఈ డైలాగ్ లానే బయట కూడా జరుగుతుంది. పవన్ ఏది అంటే అది ట్రెండ్ గా మారిపోతుంది. ఇప్పుడు అంతలా పవన్ ఏం ట్రెండ్ సెట్ చేశాడు అనేగా.. పదండి పూర్తిగా తెలుసుకుందాం.
మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్.. ఏ హెయిర్ స్టైల్ చేసినా.. ఏ డ్రెస్ వేసినా అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా మారారు. ఇక అప్పుడు సినిమాలో ఎలా అయితే ట్రెండ్ సృష్టించారో.. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్.. కాకినాడ పోర్ట్ లో బియ్యం అక్రమ రవాణాను పరిశీలించిన ఆయన అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ఒక మాట అన్నారు.. అదే సీజ్ ది షిప్. ఈ ఒక్క మాట సోషల్ మీడియాను షేక్ చేసింది. పవన్ కు ఎక్కడలేని ఎలివేషన్స్ ఇచ్చింది.
అది పవన్ రేంజ్ అంటే.. అంటూ మీమ్స్, వీడియోస్ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అంతకు మించిన విషయం ఏంటంటే ఇప్పుడే అదే మాట.. సినిమా టైటిల్ గా మారింది. అరేయ్ ఏం మాట్లాడుతున్నారు.. అది టైటిల్ ఏంటి.. ? అని అనుకుంటున్నారా.. ? అవును తాజాగా సీజ్ ది షిప్ పేరును ఒక బ్యానర్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు.. ?ఆ బ్యానర్ ఏంటి.. ? అనేది ఇంకా తెలియరాలేదు.
పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట.. ఒక సినిమాకు టైటిల్ గా మారడం అనేది చాలామందికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆయన ఫ్యాన్స్ కు మాత్రం ఆనందంగానే ఉంది. ఇక ఈ సినిమాకు హీరో ఎవరై ఉంటారు. కచ్చితంగా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉంటారని చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆర్. ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.
Bigg Boss8 Telugu : బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు? గెస్టులు ఎవరంటే?
ఇక హీరోల్లో పవన్ భక్తుడు అంటే టక్కున నితిన్ అనే చెప్పుకొస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన సాంగ్స్ ను నితిన్ రీమిక్స్ చేశాడు. పవన్ టైటిల్స్ కూడా కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ టైటిల్ ను కూడా నితినే తీసుకున్నాడని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చెప్పాలంటే.. పార్టీ ఫండ్ కోసం ఎలక్షన్స్ కు ముందు ఆయన ఒప్పుకున్న సినిమాలు మూడు సెట్స్ మీద ఉన్నాయి. ఎలాగైనా వాటిని పూర్తిచేయడానికి పవన్ కష్టపడుతున్నారు. ఇప్పటికే హరిహరవీరమల్లు క్లైమాక్స్ షూట్ లో పవన్ పాల్గున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పూర్తిచేసి OG సెట్ లో అడుగుపెట్టనున్నారు. ఇక ఈ రెండు సినిమాన్లను పూర్తిచేసి కానీ, పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేయరు అని తెలుస్తోంది. మరి పవన్.. ఎప్పుడు ఈ సినిమాలను ఫినిష్ చేస్తారు.. ? అవేప్పుడు రిలీజ్ అవుతాయో అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.