E-Paper
Advertisement

నిజామాబాద్‌లో నితిన్‌ నబీన్‌ పాదయాత్ర రద్దు! బండి సంజయ్‌ ప్రకటించిన తేదీనే అర్వింద్‌ కూడా! ‘బండి’కే ఓటేసిన అధిష్టానం..!

నిజామాబాద్‌లో నితిన్‌ నబీన్‌ పాదయాత్ర రద్దు! బండి సంజయ్‌ ప్రకటించిన తేదీనే అర్వింద్‌ కూడా! ‘బండి’కే ఓటేసిన అధిష్టానం..!
Advertisement

ఓవైపు నేతల మధ్య సమన్వయం కుదిర్చి, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని తండ్లాడుతుంటే.. ఇక్కడ నేతల తీరు మాత్రం కుక్క తోక వంకరే..! అన్నట్టుగానే ఉంటుందట. ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా ఉన్న ఎంపీల వ్యవహార శైలి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. తాజాగా నిజామాబాద్‌ ఎంపీ మరోసారి వార్తలోకెక్కారు. అతనికి గర్వభంగం కలిగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఆ పార్టీలోనే కాదు.. స్టేట్ రాజకీయాల్లో కూడా చర్చకు తెర తీస్తున్నది. అసలేం జరిగింది? అర్వింద్‌కు గర్వభంగం ఏ విషయంలో జరిగింది?

ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ కూడా ఓ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నది. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని పాతరేద్దాం..! అనే నినాదంతో భారీ ర్యాలీలు చేపట్టాలని దేశ వ్యాప్త పిలుపునిచ్చింది ఆ పార్టీ. దీనికి మహా పాదయాత్ర అని నామకరణం కూడా చేసుకున్నారు. తెలంగాణలో అమిత్ షా దీన్ని ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు నేతృత్వంలో ఇది జరిగింది.

Advertisement

అసలు వివాదం ఆ తరువాతే మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తమ వద్దకు వస్తున్నారంటే, తమ వద్దకు వస్తున్నారంటూ ఇద్దరు ఎంపీలు పోటీలు పడి ప్రకటించుకున్నారు. ఈనెల 23న కరీంనగర్‌లో జరిగే మహా పాదయాత్రకు నితిన్ వస్తున్నారని ప్రచారం చేసుకున్నారు ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, అదే తేదీలో నిజామాబాద్‌ పాదయాత్రకు వస్తున్నారంటూ ఎంపీ అర్వింద్‌ కూడా పోటీ ప్రకటన చేశాడు. ఇదే వివాదమైంది.

ఇద్దరి వద్దకు ఒకే రోజు ఎలా సాధ్యమవుతుంది? అనే చర్చ పార్టీలో జరిగింది. కానీ ఎవరూ వెనక్కి తగ్గలేదు. వీరిద్దరినీ ఎవరూ వారించలేదు. సర్దిచెప్పే ప్రయత్నమూ జరగలేదు. దీంతో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఇవాళ అధిష్టానం దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 23న కరీంనగర్‌లో జరిగే పాదయాత్రకే నితిన్‌ హాజరవుతారని ప్రకటించడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. వెంటనే అర్వింద్‌తో ఓ ప్రెస్‌మీట్‌ కూడా పెట్టించారు.

Advertisement

అమిత్‌ షాతో నిజామాబాద్‌లో వచ్చే నెల పాదయాత్ర, భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించుకున్నారు అర్వింద్. రాష్ట్ర నాయకత్వం మాటను పెడచెవిన పెట్టే అర్వింద్‌కు, అధిష్టానం గర్వభంగం కలిగే నిర్ణయం తీసుకోవడంతో పాటు.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ తను అనుకున్న పర్యటన రద్దయ్యిందని చెప్పించడం కొత్త చర్చకు తెర తీసింది. పార్టీకి నష్టం కలిగించేలా నాయకులు ప్రవర్తిస్తే ఇకపై అధిష్టానం జోక్యం ఇలాగే ఉంటుందనే సంకేతాలిచ్చింది ఢిల్లీ పార్టీ.

గతంలో స్టేట్‌ ప్రెసిడెంట్ రాంచంద్రరావుపైనా అర్వింద్‌ నేరుగా విమర్శలు గుప్పించాడు. పార్టీకి నోరులేని ప్రెసిడెంట్ ఉన్నారని, అందుకే పార్టీ ఎదగలేకపోతుందనే విధంగా కామెంట్ చేశాడు. త్వరలో నోరున్న ప్రెసిడెంట్ రాబోతున్నాడని తనకు తానుగా ప్రమోట్‌ చేసుకునే ప్రయత్నంలో ప్రస్తుత అధ్యక్షుల వారిని అవమానపరిచే విధంగా కామెంట్ చేాశారని మండిపడ్డారు బీజేపీ నేతలు.

Tags

Related News

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?

Big Stories

Advertisement
×