E-Paper
Advertisement

పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!

పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!
Advertisement

బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహంపై సైబ‌ర్ క్రైం పోలీసులు కేసులు సీరియ‌స్ అయ్యారు. బండి సంజ‌య్ కొడుకు పోక్సో కేసు విష‌యంలో మైన‌ర్ బాలిక, ఆమె తల్లిదండ్రుల వీడియోలు.. వివ‌రాలు.. పోస్టు చేస్తూ.. రాజ‌కీయంగా దుమారం రేపేందుకు అతి చేశారు. కేటీఆర్ దీనికి బాగా ప్ర‌యార్టీ ఇవ్వ‌డం.. అప్పుడే జైలు నుంచి వ‌చ్చిన ఈ సోష‌ల్ మీడియా ఇంచార్జి క్రిషాంక్ మ‌రింత రెచ్చిపోయి.. ఈ వివ‌రాల‌న్నీ పెట్ట‌డం.. పోలీసులు గుర్తించారు. అన్నిట్లోనూ అతి తెలివి చూపిన‌ట్టు.. దీంట్లో అత్యుత్సాహం కూడా తోడైంది.

కేటీఆర్ ద‌గ్గ‌ర మెప్పు కోసం హ‌ద్దులు దాటి మ‌రీ సోష‌ల్ మీడియాల‌ను దుర్వినియోగం చేశారు. కేటీఆర్ స్వ‌యంగా ట్వీట్ చేశాడు కూడా.. మెయిన్ మీడియా ప‌ట్టించుకోవ‌డం లేదు.. సోష‌ల్ మీడియా బండి సంజ‌య్ భ‌ర‌తం ప‌డుతున్న‌ద‌ని… ఇక మ‌రింత రెచ్చిపోయింది ఆయ‌న టీమ్‌. ఇప్పుడు దీనిపై సైబ‌ర్ క్రైం పోలీసులు వేట మొద‌లుపెట్టారు. వీరిపై కేసులు న‌మోదు చేసే ప‌నిని మొద‌లు పెట్టారు. దీంతో ఇప్పుడు బీఆరెస్ సోష‌ల్ మీడియా ఒక్క‌సారిగా గ‌ప్ చుప్ అయ్యింది. POCSO చట్టం కింద నమోదైన FIR No. 684/2026 లో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, FIR No. 706/2026, U/s. 74 of the Juvenile Justice Act, Sec. 72(1) of BNS and Sec. 23 of the POCSO Act కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

అదేవిధంగా, ఈ విధమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత URLలను గుర్తించి, ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వారెక్క‌డున్నా వెతికి మ‌రీ ప‌ట్టుకుని అరెస్టు చేసేందుకు పోలీసుల వేట కొన‌సాగుతోంది. బాధితురాలైన బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు సమాచారాన్ని ప్రచురించిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయబడ్డాయి. ప‌ట్టుకోవ‌డ‌మే త‌రువాయిగా ఉంది. అకౌంట్లు బ్లాక్ చేయ‌నున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియ‌స్‌గా ఉన్నారు.

విచార‌ణ‌లో భాగంగా టైమ్ తీసుకున్నారే త‌ప్ప‌.. ఈ కేసులో క్లారిటీ వ‌చ్చింద‌ని, ఇక ఉపేక్షంచేది లేద‌న్నారాయ‌న‌. విచ్చ‌ల‌విడిగా రెచ్చిపోతున్న బీఆరెస్ సోష‌ల్ మీడియా ఈ ఉదంతంలో ఇరుక్కుపోయింది. క్రిషాంక్‌కు మ‌రోసారి జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దు. బీఆరెస్ పార్టీ మొత్తం ఇప్పుడు ఈ సోష‌ల్ మీడియా మీదే న‌డుస్తుంది. కేటీఆర్ ఆదేశించ‌గానే.. వీరంతా పెయిడ్ బ్యాచ్‌లా రెచ్చిపోయి పోస్టింగులు పెట్ట‌డం.. పరిపాటిగా మారింది. బండి సంజ‌య్ కొడుకు కేసు విష‌యంలో.. మ‌రీ ఈ వ్య‌వ‌హారం మితిమీరిపోయింది. ఇప్పుడు ప‌రువు బ‌జారునప‌డే ప‌రిస్థితి తెచ్చుకున్న‌ది.

Related News

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

రామాయణంలో పిడకల వేట.. ఫామ్‌హౌజ్‌ల వెంట కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర..!

జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత దూరం.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఇక సర్కార్‌ నజర్.. ! మరో ఏడాది పట్టే అవకాశం..?

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

Big Stories

Advertisement
×