Tanveer Ahmed : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers Bengaluru) అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో అదరగొడుతోంది బెంగళూరు. దీని ఫలితమే పాయింట్ల పట్టికలో కూడా బెంగుళూరు మొదటి స్థానంలో ఉండటం. దానికి తగ్గట్టుగానే విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో అర్థ సెంచరీ అయిన చేసి ఇరగదీస్తున్నాడు.
మొన్న కేకేఆర్ పైన 58 బంతుల్లో సెంచరీ నమోదు చేసి బెంగళూరును ( RCB) విజయతీరాలకు చేర్చాడు విరాట్ కోహ్లీ (Tanveer Ahmed). అయితే ఈ సెంచరీ నమోదు తర్వాత విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ( Virat Kohli) పరువు తీసేలా మాట్లాడుతున్నారు. టి20 లకు పనికిరాదని.. టెస్టులకు మాత్రమే విరాట్ కోహ్లీ సెట్ అవుతాడని ఇజ్జత్ తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ పాకిస్తాన్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లాంటి చెత్త ఆటగాడిని జన్మలో ఎన్నడూ చూడలేదని బాంబు పేల్చాడు.
కేకేఆర్ వర్సెస్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ( Virat Kohli) సెంచరీ నమోదు చేసిన నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నాడు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సెటైర్లు పేల్చారు. విరాట్ కోహ్లీ లాంటి సిగ్గు లేని ప్లేయర్ ను ఇప్పటి వరకు తన జన్మలో చూడలేదని తెలిపారు. సింగిల్ తీసిన కూడా సెంచరీ చేసినట్లుగా ఫీల్ అవుతాడని ఎద్దేవా చేశారు. ఇక సెంచరీ చేస్తే వరల్డ్ కప్ వచ్చినట్లుగానే ఫీలై గ్రౌండ్ మొత్తం తిరిగేస్తాడని ఇజ్జత్ తీశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అనవసరంగా విరాట్ కోహ్లీని ఆడిస్తున్నారని మండిపడ్డారు. అతని అభిమానులు మ్యాచ్ చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వ్యూయర్షిప్ పెరుగుతుందని భావించి.. విరాట్ కోహ్లీని భరిస్తున్నారు తప్ప.. ఇంకేం లేదని సెటైర్లు పేల్చాడు. బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లీ దేనికి పనికిరాడు అని.. ఇకనైనా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించి, రెస్ట్ తీసుకోవాలని సూచనలు చేశారు. 58 బంతుల్లో సెంచరీ చేసి ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడని మండిపడ్డారు. ఇదే ప్లేస్ లో మరో ప్లేయర్ ఉంటే, డబుల్ సెంచరీ చేసేవాడని సెటైర్లు పేల్చాడు తన్వీర్ అహ్మద్.