E-Paper
Advertisement

అస‌మ‌ర్థుని జీవ‌యాత్ర‌!సీతారామారావును కేటీ రామారావు ఫాలో అవుతున్నాడా? కేటీఆర్ పుస్త‌కాలు కూడా చ‌దువుతున్నాడా?

అస‌మ‌ర్థుని జీవ‌యాత్ర‌!సీతారామారావును కేటీ రామారావు ఫాలో అవుతున్నాడా? కేటీఆర్ పుస్త‌కాలు కూడా చ‌దువుతున్నాడా?
Advertisement

అస‌మ‌ర్థుని జీవ‌యాత్ర‌. 1947లో త్రిపుర‌నేని గోపిచంద్ రాసిన మ‌నోవైజ్ఞానిక న‌వ‌ల‌. ఇలా చెప్పేబ‌దులు.. సైకాల‌జిక‌ల్ నావెల్ అంటే ఎక్కువ మందికి అర్థ‌మవుతుంది కావొచ్చు. మ‌నిషి త‌త్వంపై, మాన‌సిక స్థితిపై రాసిన ప్ర‌సిద్ద న‌వ‌ల‌. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఇది అంద‌రికీ న‌ప్పే న‌వ‌ల‌. ఎవ‌రికి వారు త‌మ‌ని తాము త‌రిచి చూసుకునే న‌వ‌ల‌.

అందులో పాత్ర‌పేరు సీతారామారావు. అత‌నే అందులో హీరో. తెలివిగ‌ల వాడు. ఎంత తెలివిగ‌లవాడైంటే.. త‌న‌లాంటి వాడు, త‌న‌లా ఆలోచించేవాడు ఇక ఈ ప్ర‌పంచంలోనే లేడ‌నుకునేవాడు. ఇక పుట్ట‌బోడ‌ని కూడా భ్ర‌మించేవాడు.ఆ స‌మ‌యంలో అత‌ను ఏది అనుకుంటే అదే క‌రెక్టు. ఒక‌వేళ ఆ అభిప్రాయం త‌రువాతి కాలంలో మార్చుకున్నాడ‌నుకో.. అప్పుడు అదే క‌రెక్టు. అంతే ఎప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు మార్చుకుంటా ఉంటాడు.

Advertisement

స‌మాజాన్ని తిట్టిపోస్తా వుంటాడు. తోటి మ‌నుషుల‌ను పురుగుల క‌న్నా అధ్వాన్నంగా చూస్తా వుంటాడు. వాళ్ల ఆలోచ‌న‌లు, న‌డ‌వ‌డిక‌, ప్ర‌వ‌ర్త‌న‌ను విప‌రీతంగా ఏవ‌గించుకుంటూ ఉంటాడు. నిండా అహంకారం పూని… అదే మ‌దంతో త‌న‌కు తోచింది చేస్తావుంటాడు. చెప్తావుంటాడు. అదే క‌రెక్టు అని వాదిస్తా వుంటాడు. తోటి మ‌నిషిని త‌ప్పుబ‌డ‌తా ఉంటాడు. వారు ఎంత‌టి దురాశ ప‌రులో క‌దా అని తిట్టిపోస్తా వుంటాడు.

తినేందుకే పుట్టారా ఈ మ‌నుషులు..? ఈ స‌మాజం ఏంది ఇంత ఛండాలంగా ఉంది..? అని ఏవ‌గించూ ఉంటాడు. త‌ను ఈ ప్ర‌పంచంలో పుట్ట‌క‌పోతే.. ఈ ప్ర‌పంచం ఏమైపోయేది అని కూడా చింతిస్తూ ఉంటాడు. త‌న‌లాంటి మ‌నిషి పుట్టుక అంటే. ఇదేదో అద్భుతం జ‌రిగితే త‌ప్ప సంభ‌వం కాద‌ని కూడా స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంటా ఉంటాడు.

Advertisement

మొత్తంగా.. ఇది అంద‌రూ చ‌దువుకుని, సీతారామారావులా ఉండ‌కూడ‌ద‌ని నేర్చ‌కునేందుకు ప‌నికి వ‌చ్చే ఓ అద్భుత న‌వ‌ల‌. ఇప్ప‌టి త‌రానికి ఈ పుస్త‌కం గురించి తెలియ‌దు. అవును.. ఇంత‌లా దీని గురించి ఎందుకు ఇప్పుడు చెప్ప‌డం..? అని అనుకుంటున్నారా? అక‌స్మాత్తుగా, అనుకోకుండా.. కేటీఆర్ నోటి వెంట ఈ పుస్త‌కం పేరు వ‌చ్చింది. స‌ర్కార్‌ను విమ‌ర్శించే స‌మ‌యంలో, పాల‌కుడి పాల‌న‌ను చేత‌గాని పాల‌న అని సంబోధించేందుకు అస‌మ‌ర్థుడి జీవ‌యాత్ర‌లా మారింద‌న్నాడు.

ఇది అన్య‌ప‌దేశంగా వ‌చ్చిన మాట‌నా? లేక ఈ పుస్త‌కాన్ని కేటీఆర్ చ‌ద‌వి ఉంటాడా? అందులో పాత్ర పేరు సీతారామారావు, ఇక్క‌డ కేటీ రామారావు.. అంతే తేడా. మ‌రి కేటీఆర్ ఆ సీతారామారావు నుంచి నేర్చ‌కున్నాడా? ఆ సీతారామారావునే ఫాలో అవుతున్నాడా..? ఆ న‌వ‌ల చివ‌ర‌లో ముగింపు విషాదంగా ఉంటుంది. చివ‌ర‌కు ఆ విషాదం చ‌దివైనా.. త‌ను ప‌రివ‌ర్త‌న చెందాడ‌ని అనుకుందామా? అంటే కేటీఆర్ మాట‌ల‌ను, చేష్ట‌ల‌ను చూస్తే అట్లా అనిపించ‌డం లేదు. అచ్చంగా ఆ న‌వ‌ల‌లోని పాత్ర‌లాగే ప్ర‌వ‌ర్తిస్తున్నాడు త‌ప్ప‌… దీని సారం తెలుసుకుని అస‌లైన అర్థాన్ని వంట‌బ‌ట్టించుకున్న‌ట్టైతే క‌నిపించ‌డం లేదు.

అవునూ.. డెబ్బై వేల పుస్త‌కాలు చ‌దివిన మ‌హానేత పుస్త‌కాల లిస్టులో ఈ పుస్త‌కం ఉండి ఉంటుందా? ఉన్నా .. చ‌ద‌వి ఉంటాడా? చ‌దివినా.. అది నెత్తికెక్కి ఉంటుందా? నెత్తికెక్కితే మాత్రం ఇలా తిక్క‌తిక్క చేష్ట‌లైతే చేయ‌డు.

Related News

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!

బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

Big Stories

Advertisement
×