E-Paper
Advertisement

700 అభ్యంతరాలు పంపింది బీఆర్ఎస్సే! ఒకే ఫార్మాట్లో వివిధ పేర్లతో! కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. !

700 అభ్యంతరాలు పంపింది బీఆర్ఎస్సే! ఒకే ఫార్మాట్లో వివిధ పేర్లతో! కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.. !
Advertisement

చెల్లంటే ఎంత కోప‌ముందో.. ఆమెను రాజ‌కీయంగా ఎద‌గకుండా అడ్డుకునేందుకు తాజాగా చేసిన ఈ ప్ర‌య‌త్న‌మే మ‌రోసారి నిరూపించింది. ఆమె పెట్టుకున్న టీఆరెస్ పార్టీ మాదేన‌న్నాడు. దీన్ని ఎవ‌రికి కేటాయించొద్ద‌ని అన్నాడు. అంతే కాదు.. ఏకంగా 700 మందితో అభ్యంత‌రాలు త‌నే పంపించాడు. పేర్లు వేరు.. ప్రాంతాలు వేరు.. కానీ అదే ఫార్మాట్‌లో వంద‌ల అభ్యంత‌రాలు. ఆ అభ్యంత‌రాల స్క్రిప్టు తెలంగాణ భ‌వ‌న్ లోనే జ‌రిగాయి. ఎవ‌రెవ‌రు వేశారు ఈ అభ్యంత‌రాలు..? వారేం చెబుతున్నారోన‌ని లోతుగా ప‌రిశీల‌న జ‌రిపిన క‌విత బృందం షాక్ అయ్యింద‌ట‌. అవ‌న్నీ మ‌న రామ‌న్న‌నే పంపాడ‌ని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నార‌ట‌. అంటే ఎన్ని ఎక్కువ అభ్యంతరాలుంటే అంత‌గా ఆమె కొత్త పార్టీని డ్యామేజీ చేయొచ్చ‌ని కేటీఆర్ భావించి ఉంటాడు.

అంతే కాదు.. ఓ ఇద్ద‌రు ఎంపీలు.. దామోద‌ర‌రావు, వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌.. స్వ‌యంగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను క‌లిశారంట‌. అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ట‌. అప్ప‌టికే వారిచ్చిన గ‌డువు ముగిసింద‌ట‌. అంటే.. ఈ పార్టీ పేరును క‌విత‌కు కేటాయించొద్ద‌ని కేటీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. టీఆరెస్ పార్టీ పేరును ఆమె తీసుకుంటుంద‌ని క‌నీసం ఊహించ‌లేక‌పోయారు కేసీఆర్, కేటీఆర్‌.

Advertisement

తెలంగాణ జాగృతి పేరుతోనే ఏదో ఒక పార్టీ పెట్టుకుంటార‌ని భావించారు. కానీ క‌విత చివ‌రి వ‌ర‌కు దీన్ని ర‌హ‌స్యంగానే ఉంచారు. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆవిర్భావం రోజున టీఆరెస్ అని ప్ర‌క‌టించినా.. పేరులో కొంత మార్పు చేసి ప్ర‌క‌ట‌న చేయ‌డం కూడా ఓ వ్యూహ‌మే. అంటే చివ‌రి వ‌ర‌కు తండ్రీకొడుకుల ఊహ‌కు కూడా అంద‌ని విధంగా ఆమె రాజ‌కీయంగా తీసుకున్న నిర్ణ‌యాలు .. అంతిమంగా ఆమె అనుకున్న‌ది సాధించేలా చేశాయి.

లేటుగా తేరుకున్న కేటీఆర్‌.. గింగిరాలు తిరుగుతూ.. గ‌గ్గోలు పెడుతూ ఎన్ని అభ్యంత‌రాలను త‌నే స్వ‌యంగా ఏర్చి కూర్చి వండి వార్చి పంపినా.. అక్క‌డ అవి చెల్లుబాటు కాలేదు. ఆమె ప‌క్కా ప్లానింగ్ ప్ర‌కారం.. నిబంధ‌న‌ల‌ను అనుస‌రించే ముందుకు సాగారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీ అడుగు ఆమె ఒక‌టికి రెండు సార్లు ఆలోచించే .. అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు తీసుకునే ముందుకు సాగారు. పార్టీ పేరును ఇప్పుడు ఎవ‌రు కాద‌న్నా.. ఎవ‌రికి ఇష్టం లేకున్నా.. క‌విత‌కే ద‌క్కింది. ఇక టీఆరెస్‌ను బీఆరెస్ మరిచిపోవాల్సిందే.

Advertisement

మ‌మ్మ‌ల్ని ఇంకా జనాలు టీఆరెస్‌గానే గుర్తిస్తారు.. అని క‌మిష‌న్‌కు లేఖ రాసిన కేటీఆర్‌.. మ‌రి ఆ పేరెందుకు మార్చారో జ‌నానికి వివ‌రించారా? వారి మ‌ద్ద‌తు మీకు ఉందా? తెలంగాణ లేకుండా చేసుకుంటున్నామ‌నే సోయి లేకుండెనా? అప్పుడంతా ఓ ట్రాన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు తేరుకున్నా.. ఫ‌లితం అనుభ‌విస్తున్నారు. ప‌శ్చాత్తాపం మాత్రం లేదు.. అని అనుకుంటున్నారు గులాబీ నేత‌లే కొంద‌రు.

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

బీఆర్‌ఎస్‌ సర్వేలో రేవంత్ సర్కార్‌కు పాస్‌ మార్కులు.. ! పాలనపై అసంతృప్తి లేదు.. సంతృప్తీ లేదు..

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

Big Stories

Advertisement
×