బొద్దింకలు తమను ముప్పుతిప్పలు పెట్టిన అస్త్రాన్ని ఇక్కడ బీజేపీ నేతలు రేవంత్‌పై సంధిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్‌లో చేసిన క్యాండిల్ ర్యాలీ ఓ రకమైన ఇరిటేషన్ కు గురిచేస్తే… రాహుల్‌ను పీఎం చేస్తా.. ఇండి కూటమి నేతలతో మాట్లాడి జెన్‌జీనే విద్యాశాఖ మంత్రిని చేస్తా అని ఈ వేదికగా రేవంత్ మాట్లాడటం పుండు మీద కారం చల్లినట్టయ్యింది వారికి.
అందుకే ఇప్పుడు రేవంత్‌ను టార్గెట్ చేశారు ఈ విషయంలో. బొద్దింకలు ఏ అంశం మీద కేంద్రాన్ని ముప్పుతిప్పలు పెట్టారో…. సీఎం యువతను ఆకట్టుకోవడానికి చెప్పిన మాటలను కూడా తిప్పికొట్టే క్రమంలో ఈ నిర్ణయానికి వచ్చారు. ఓ కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు, రఘునందన్‌రావు, బండి సంజయ్.. ఇలా వరుసపెట్టి జెన్‌జీ గురించే మాట్లాడుతున్నారు. అంటే తామేమీ జెన్‌జీ చేసిన ఉద్యమాన్ని సపోర్టు చేయడం లేదు.
జెన్‌జీలను కాంగ్రెస్ మీద ఉసిగొలిపే ప్రయత్నం చేస్తన్నది. 21 ఏళ్లకే చట్టసభల్లోకి యువత అడుగు పెట్టాలని .. అసెంబ్లీ తీర్మానం కూడా చేసి పంపుతామని సీఎం ప్రకటించాడు. దీనిపైనా భగ్గుమంటున్నారు. రేవంత్.. ఢిల్లీ రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకుని.. అదేదో తమ విజయంగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం పట్ల బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.
అందుకే ఇవే అస్త్రాలను రేవంత్‌పై ప్రయోగిస్తున్నారు. నీ పాలనలో కూడా లీకులు అయ్యాయి కదా.. మరి రాజీనామా చెయ్.. ! అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. విద్యాశాఖ నీ వద్దే ఉంది కదా.. మరి దాన్ని మీ పార్టీలోని యువతకు కేటాయించొచ్చు కదా..? అని కౌంటర్ చేస్తున్నారు.
అంటే రేవంత్ మాట్లాడిన మాటలు.. ఇచ్చిన హామీలను ఇలా రేవంత్‌పైకే విసురుతూ.. జెన్‌జీని కాంగ్రెస్ సర్కార్‌పై ఉసిగొల్పాలని చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. పేపర్ లీకుల అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రాజీనామా చేయాలనే అంశాన్ని బయటకు తీసుకురావడంతో పాటు.. ఆయన వద్దే ఉన్న విద్యాశాఖను ఇంకా ఎందుకు వేరే ఒకరికి ఇవ్వడం లేదు. అంటే యువత లేరా? ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క యువ ఎమ్మెల్యే కూడా లేడా? అని నిలదీయడం ద్వారా జెన్‌జీలో కూడా ఈ ఆలోచన లేవనెత్తి వారిలో కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవడం ద్వారా కాంగ్రెస్ సర్కార్‌పై ఎదురు దాడి చేయొచ్చని భావిస్తున్నారు.
ఒక్క కొండా విశ్వేశ్వర రెడ్డి మినహా.. అంతా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కొండా మాత్రం సెల్ఫ్‌గోల్ కావడమే కాదు.. షరా మామూలుగా పార్టీనీ ఇబ్బందుల్లో నెట్టేసి జెన్‌జీ వద్ద మరింత పలుచనయ్యేలా చేశాడు. ఇప్పుడు రేవంత్ వద్ద విద్యాశాఖ ఉండటం కూడా కత్తి మీద సాములాగే మారింది.
పొరుగువారికి నీతులు చెప్పిన మనం..అవే తప్పులు చేసి దొరికిపోతే.. అదే జెన్‌జీ ఇక్కడా తిరగబడితే.. ఇది ప్రధాన ప్రతిపక్షానికి ప్రధాన ఆయుధంగా మారుతుంది. ముందు అది జరగకుండా చూసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం రేవంత్ మీద ఉంది.