E-Paper
Advertisement

బీజేపీ నేత‌ల‌ది జెన్‌బీ మంత్రం… ఓటు బ్యాంకును సంతృప్తి ప‌రిచేందుకు తిక్క మాట‌లు త‌ప్ప‌వు మ‌రి!

బీజేపీ నేత‌ల‌ది జెన్‌బీ మంత్రం… ఓటు బ్యాంకును సంతృప్తి ప‌రిచేందుకు తిక్క మాట‌లు త‌ప్ప‌వు మ‌రి!
Advertisement

జెన్‌జీ విన్నాం.. కానీ కొత్త‌గా ఈ జెన్‌బీ ఏందీ? ఇదే క‌దా మీ అనుమానం. అక్క‌డికే వ‌స్తున్నా. జ‌న‌రేష‌న్ జ‌డ్‌.. ప‌దానికి సంక్షిప్త రూపం జెన్‌జీ. కానీ బీజేపీకి స‌ప‌రేట్ జ‌న‌రేష‌న్ ఉంది. అదే యువ‌త‌. అందుకే బీజేపీ జ‌న‌రేష‌న్‌ను జన‌రేష‌న్ బీజేపీ అనుకుంటే.. దీనికి సంక్షిప్త రూపం జెన్‌బీ అన్న‌మాట‌. అంటే ఓ ర‌కంగా చెప్పాలంటే బీజేపీ బొద్దింక‌ల‌న్న మాట‌.

స‌ప‌రేట్ జ‌న‌రేష‌న్ ఏందీ? య‌వ‌త అంటే అంతా వ‌స్తారు క‌దా? అనే అనుమాన‌మూ రావొచ్చు. కానీ కొంద‌రు రారు. వారికి మోడీ ఏం చేసినా ఓకే.. ఆయ‌న శ్రీ‌రామ చంద్రుడికి మ‌రోరూపం.. అనుకునే యువ‌త ఉన్నారు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టే ప‌ర‌మ‌తాల నుంచి మ‌మ్మ‌ల్ని కాపాడి.. హిందుత్వాన్ని కాపాడి.. ఇలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు సాధ్య‌మ‌య్యింద‌ని కూడా ఫిక్స‌యిపోయారు.

Advertisement

అందుకే జెన్‌జీ అంతా ఒక‌వైపు ఉంటే.. ఈ జెన్‌బీ మ‌రోవైపు అన్న‌మాట‌. అందుకే ఈ జెన్‌బీని త‌క్ష‌ణం బీజేపీ నేత‌లు సంతృప్తి ప‌రచాలి. ఎందుకు వీరిని సంతృప్తి ప‌ర‌చాలి? వీరే క‌దా ఓట్లేసి గెలిపించింది. అంతో ఇంతో బీజేపీని జ‌నాల్లో నిల‌బెట్టింది. అందుకే వీరిని సంతృప్తి ప‌ర‌చాలి… మోడీ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించాలి.. ఆ జెన్‌జీ చ‌ర్య‌ల‌ను విమ‌ర్శించాలి. బుర‌ద‌జ‌ల్లాలి. వాటికి వ‌క్ర‌భాష్యం చెప్పాలి.

అందుకే రంగంలోకి దిగారు ఓ రాంచంద్రారావు, ఓ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, ఓ బండి సంజ‌య్‌, ఓ ర‌ఘునంద‌న్‌రావు, ఓ డీకే అరుణ‌.. కిష‌న్‌రెడ్డి ఇలా అంతా దిగారు రంగంలోకి. తలోమాట‌న్నారు జెన్‌జీని. మోడీ .. ప్ర‌ధాన్ రాజీనామాకు ఎందుకు ఆమోదం తెలిపాడో తెలుసా..? దీని వెనుక జాతి క్షేమం ఎంత‌లా ముడి ప‌డి ఉందో మీకు అర్థ‌మైందా? హిందుత్వాన్ని కాపాడేక్ర‌మంలో మోడీ ఇలాంటి మెరుపు నిర్ణ‌యాల‌కు కూడా వెనుకాడ‌డని మీకు ఇప్ప‌టికైనా తెలిసిందా? అస‌లు ఆ జెన్‌జీ ఉద్య‌మం వెనుక ఎవ‌రున్నారంటే..? ఆ బొద్దింక‌ల‌ను కాల్చ పారేసినా త‌ప్పులేదు.. అమెరికాలో అయితే అదే చేసేవారు.. మ‌న మోడీ కాబ‌ట్టి…! ఇలా ఉన్నాయి వీరి స్పంద‌న‌లు, కామెంట్లు.

Advertisement

ఊరంద‌రిదీ ఓ దారైతే.. ఉలిపిక‌ట్టెది మ‌రోదారి అన్న‌ట్టుగా సాగిన తెలంగాణ బీజేపీ నేత‌ల కామెంట్ల‌పై అంతా విరుచుకుప‌డ్డారు. వీరికి మైండ్ లేదా ఏందీ? ఇలా మ‌రీ సోయిలేని మాట‌లు మాట్లాడుతూ.. బీజేపీని మ‌రింత భ్ర‌ష్టు ప‌ట్టిస్తారా? ఇలా అయితే అధికారంలోకి వ‌చ్చిన‌ట్టే అంటూ చాలా మంది మండిప‌డ్డారు. బీజేపీ నేత‌ల తీరును తిట్టిపోశారు. కానీ దీని వెనుక జెన్‌బీ మంత్రం ఉంద‌ని పాపం.. ఎవ‌రికీ తెలియ‌దు.

అవును.. ఎలాగూ వ‌చ్చిన పేరు రానే వ‌చ్చింది. ఆ జెన్‌జీ త‌మ‌కు ఎట్లాగూ వ్య‌తిరేక‌మే.. కానీ మా జెన్‌బీని మేము కాపాడుకోవాలె క‌దా.. వారు సంతృప్తి చెందేలా మాట్లాడాలె క‌దా? మ‌రి మాకు ఓట్లేసి గెలిపించేది వారే క‌దా..? అనేది వారి రాజ‌కీయ కోణం. ఇదీ బీజేపీ నేత‌ల గెలుపు సీక్రెట్. బీజేపీ బొద్దింక‌లను కాపాడుకునే రాజ‌కీయ మంత్రం.

Related News

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

Big Stories

Advertisement
×