E-Paper
Advertisement

BRS : జగిత్యాలలో కేసీఆర్.. ఢిల్లీకి హరీశ్ రావు.. ఏం జరుగుతోంది?

BRS : జగిత్యాలలో కేసీఆర్.. ఢిల్లీకి హరీశ్ రావు.. ఏం జరుగుతోంది?
Advertisement

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేడు జగిత్యాల వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున సభను నిర్వహిస్తున్నది.కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్ల పాటు సేవలు అందించి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి తన అనుచరులతో కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.చాలా కాలం తర్వాత కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. జీవన్ రెడ్డి చేరిక అనంతరం ఆయన ఏం మాట్లాడుతారో అని రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

వారం రోజులుగా సభా ఏర్పాట్లు..

బీఆర్ఎస్ సభ కోసం వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మొత్తం గులాబీ రంగు పులుముకుంది. కేవలం జీవన్ రెడ్డి చేరికకోసం ఇంత పెద్ద ఆర్భాటం చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేశారు. కానీ, కేసీఆర్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనే సంకేతాలు అధికార పార్టీని నిద్రపోనివ్వడం లేదని గులాబీ కేడర్ చెబుతోంది. జీవన్ రెడ్డికి మంత్రి పదవి లేద ఏదైనా నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ మారేవారా? అని ఇటీవల మంత్ర అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కానీ, మంత్రి పదవికోసమో, నామినేటెడ్ పోస్టుల కోసమే పార్టీ మారడం లేదని.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో ఉండలేక పార్టీకి రాజీమానా చేసినట్టు జీవన్ రెడ్డి వర్గం చెబుతోంది.

కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ..

Advertisement

కేసీఆర్ చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరవుతున్నారు. పార్టీ అధికారం కోల్పోయాక ఆయన హాజరయ్యే రెండో భారీ బహిరంగ ఇదే కావడం గమనార్హం. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన సభలో కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. కేవలం 10 నిమిషాల్లోపే ఆయన ప్రసంగం ఉండింది. ఇవాళ జగిత్యాల వేదికగా జరగనున్న సభలో ఎంత సేపు మాట్లాడుతారు? ఏ టాపిక్ మీద ఆయన ప్రసంగం ఉంటుంది? సర్కారును, సీఎం రేవంత్‌ను కార్నర్ చేస్తారా? ఇకమీదట ప్రజల్లోకి వస్తానని సంకేతం ఏమైనా పంపిస్తారా? లేదా ప్రభుత్వం మీద విమర్శలు చేశాక తిరిగి ఫాంహౌస్‌లో పరిమితం అవుతారా? అని జోరుగా చర్చజరుగుతున్నది. ప్రజలు ఇబ్బందులు, పెరుగుతున్న ధరలు.. ఎల్లుండి ఆర్టీసీ సమ్మె మొదలగు అంశాలను ప్రస్తావిస్తారా? రైతు భరోసా, రుణమాఫీ, ఆరుగ్యారంటీలపై మరోసారి విరుచుకపడతారా? అనేది తెలియాల్సి ఉన్నది.

Amaravati: షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే దాసీ అన్నాను, టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు

హరీశ్ దూరం..?

Advertisement

బీఆర్ఎస్ సభకు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇవాళ సాయంత్రం సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే, సభా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన హరీశ్ రావు .. ఉన్నట్టుండి సభకు హాజరుకాకపోవడం, ఢిల్లీకి ఎందుకు వెళ్లారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలాఉండగా, ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల మీద హైకోర్టు తుదితీర్పు వెల్లడించనుంది. అది కాస్త వ్యతిరేకంగా వస్తే కేసీఆర్, హరీశ్ రావుల మీద ప్రభుత్వం లీగల్ యాక్షన్‌కు ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం.అందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని.. కేంద్రంతో మాట్లాడి క్రిమినల్ చర్యలను అడ్డుకునేలా రాష్ట్రం మీద ఒత్తిడి తేనున్నారని టాక్ వినిపిస్తోంది.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×