E-Paper
Advertisement

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి
Advertisement

Delhi Politics: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎంలు ఒక్కతాటి మీదకు వచ్చాయన్నారు.  ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

Advertisement

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు ఆడుతున్న డ్రామాలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఈ రెండు బిల్లుల విషయంలో తెలంగాణ, తమిళనాడులోని అధికార పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఆరోపించారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జనాభా సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ, తమిళనాడుకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపణలు గుప్పించారని అన్నారు.

Advertisement

పీఠాలు కదులుతాయన్న భయం.. అందుకే బిల్లులకు వ్యతిరేకంగా ప్రచారం

దాన్ని అధిగమించే విధంగా దక్షిణ భారతానికి సీట్లు తగ్గకుండా ఉండేలా అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలతోపాటు పురుషుల్లో కొత్త నాయకత్వం వస్తుందని భయం ఆ పార్టీలను వెంటాడుతోందన్నారు.

అందుకే ఈ బిల్లుల విషయంలో ఎలా పడితే అలా ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరతరాలుగా వారి కుటుంబాల చేతుల్లో ఉన్నరాజకీయ వారసత్వం, ప్రాబల్యం మహిళల చేతుల్లోకి వెళ్తుందన్న కుట్రతో కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.

ALSO READ: సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు.. మొన్న రోజా, నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు

తమ పీఠాలు కదిలిపోతాయన్న భయంతో ఈ రకమైన రాజకీయ డ్రామాలు మొదలుపెట్టారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. వీటిపై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనేది ఎంఐఎం కుట్రగా వర్ణించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పదే పదే మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే అనేక ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని, పునర్విభజన జరిగితే హైదరాబాద్‌లో తమ పీఠాలు ఎక్కడ కదులుతాయోనని భయం వాటిని వెంటాడుతోందన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలను ఏకం చేసిందన్నారు. కొద్దిరోజులుగా మజ్లిస్ నేతలు చర్చలు జరిపారన్నారు.

 

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×