E-Paper
Advertisement

మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!

మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!
Advertisement

జాతీయ‌తా భావం తెస్తున్న‌దివాళ్లే.. ప్రాంతీయ‌త సెంటిమెంట్‌ను రెచ్చ‌గొడుతున్న‌దీ వాళ్లే. నేత‌ల ఈ డ‌బుల్ స్టాండ‌ర్ట్స్ విధానాల వ‌ల్లే తెలంగాణ జ‌నానికి వీరు న‌చ్చ‌డం లేదు. ఈ పార్టీలు వారి ప్రేమ‌ను చూర‌గొన‌డం లేదు. మోడీ చాలా సార్ల‌న్నాడు. పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. బ‌ల‌వంతంగా.. త‌ల్లీబిడ్డ‌ను వేరు చేసిన‌ట్టు.. ! అని. రాష్ట్ర ఏర్పాటు అయిపోయింది. అది తెలంగాణ ప్ర‌జ‌ల ద‌శాబ్దాల కల‌. అయిన‌పోయిన దాన్ని ప‌ట్టుకుని .. కాంగ్రెస్‌ను దోషిగా నిలిపే క్ర‌మంలో.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా మాట్లాడి ఏం ప్ర‌యోజ‌నం..! పోనీ ఏపీలో ఏమైనా మీరు బ‌ట్ట‌క‌ట్టేదుందా? అంటే బీజేపీకి అంత సీన్ లేదు.

అక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది కాబ‌ట్టి.. బీజేపికి క‌లిసి వ‌చ్చిందంతే. ప‌వ‌న్ కూడా బాబుగారి నీడ‌లో అలా ప‌వ‌ర్‌లో వెల‌గ‌బెడుతున్నాడు త‌ప్ప‌.. బండి కింద కుక్క నేనే బండి లాగుతున్నా.. అని అనుకుంటున్నాడిప్ప‌టికీ. వాస్త‌వ ప‌రిస్థితులు గ‌మ‌నంలోకి తీసుకోవ‌డం లేదు. ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించ‌డం లేదు. రాజ‌కీయ ప‌రిణ‌తీ సాధించ‌లేదు. అది క‌నిపిస్తూనే ఉంది. తెలంగాణలో బీజేపీ రావాలనుకున్న‌వారెవ‌రైనా ఇలా చేస్తారా? మొన్న‌టికి మొన్న బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య‌.. పార్ల‌మెంటు సాక్షిగా.. తెలంగాణ విభ‌జ‌న‌ను.. పాకిస్తాన్ విభ‌జ‌న‌తో పోల్చాడు. చెంప‌లేసుకున్నాడు. త‌ప్ప‌యింద‌న్నాడు. ఇక్క‌డి బీజేపీ నేత‌ల‌కు బాగానే ఆ సెగ త‌గిలింది. అయినా బుద్దిరాలేదు.

Advertisement

ఇవాళ ర‌ఘునంద‌న్‌.. ప‌వ‌న్ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నాడు. ప‌వ‌న్ కూడా అచ్చం.. ఓ మోడీ, ఓ తేజ‌స్వీ సూర్యలాగే మాట్లాడాడు. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ప్రేముందంటూనే, ఇక్క‌డి ప్ర‌జ‌లు మంచివాళ్లంటూనే.. తెలంగాణ నేత‌ల‌పైనే నా పోరాటం.. ఆరాట‌మ‌న్న ప‌వ‌న్‌.. మ‌రి తెలంగాణ ఆవిర్భావం రోజునే ఈ మీటింగు పెట్టుకుని గెలుక్కోవాల‌నే ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? ఎవ‌రిచ్చారు…? ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే కోర్టు దాకా పోయేంత‌గా ఇక్క‌డ నీ మీటింగుకొచ్చిన అర్జెన్సీ ఏందీ? ఇది క‌దా నీ రాజ‌కీయ ముసుగును తొల‌గిస్తున్న‌ది. నీ స‌చ్చీల‌త ఏపాటిదో బ‌య‌ట‌పెడుతున్న‌ది.

ఇప్పుడు తెలంగాణ‌లో ఎక్క‌డా ప్రాంతీయ విధ్వేషాలు లేవు. అంతా క‌లిసి ఉంటున్నారు. తెలంగాణ ఆకాంక్ష‌ల కోసం లొల్లి జ‌రుగుతుంది త‌ప్ప‌.. ఆంధ్ర అనే ముచ్చ‌టే మాట్లాడం మానేసి చాలా రోజులైంది. అంత‌లా రాష్ట్ర పున‌ర్నిర్మాణం కోసం తండ్లాడుతున్నాయి పార్టీలు. నువ్వూ రావొచ్చు. రాజ‌కీయాలు చేయొచ్చు. మొన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేశావు. ఎవ‌రికీ ఆ ముచ్చ‌టే తెల్వ‌దు. నీ పార్టీ స్థితి అది. నీకు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు తెలంగాణ‌కు.

Advertisement

జ‌న‌గ‌ణ‌మ‌న పాడ‌నీయ‌రు.. వందేమాతరం ఎందుకంటారు? లాంటి పెద్ద పెద్ద ప‌దాలు ఉప‌యోగించి.. దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామ‌నుకున్నావు గానీ, నీ బుర్ర‌లో ఎంత గుజ్జు ఉందో ఇక్క‌డి జ‌నాల‌కు మ‌రోసారి తెలియజేసి పోయావు. ఇక్క‌డ తెలంగాణ బీజేపీని ఎన్ని జాకీలు పెట్టినా లేప‌డం సాధ్యం కాద‌ని మీకు మీరే ఇలా ప్రాంతీయ విధ్వేషాల‌ను రెచ్చ‌గొట్టి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుందామ‌నే దోర‌ణిలో సాగితే.. ఇక ఎప్ప‌టికీ బీజేపీ ఇక్క‌డ ప‌రాన్న‌జీవే.

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×