Minister Seethakka: సమ్మర్ సీజన్ ఏమోగానీ.. అప్పుడే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కులగణన నివేదిక తర్వాత అధికార పార్టీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడానికి బీసీ సమాజానికి ఇదే సరైన సమయమన్నారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు ఆ అంశంపై మాట్లాడే హక్కు కోల్పోయారని అన్నారు. ఆ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని, కనీసం నియోజకవర్గంలో ప్రజలైనా ఇందులో పాల్గొవాలని ఎక్కడా చెప్పిన సందర్భం లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సీఎం, పార్టీ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. నరేంద్ర నుంచి రాజేంద్ర వరకు ఎదిగిన బీసీ నేతలను అవమానించి పార్టీ నుంచి బయటకు పంపించలేదా అంటూ మండిపడ్డారు. రెండు దశాబ్దాలుగా బీసీ వర్గాన్ని అణగ తొక్కేసిందన్నారు.
కేసీఆర్ హయాంలో రుణమాఫీ కానీ ఎంతో మంది రైతులు, ప్రస్తుతం రుణాల మాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లో రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇల్లు ఇచ్చిన సందర్భం లేదన్నారు.
ఇక రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావించకుండా దశాబ్దంపాటు రూలింగ్ చేసిందన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని లబ్దిదారులు దరఖాస్తు పెట్టిన సందర్భాన్ని వివరించారు. ప్రభుత్వ పథకాలు అనేవి నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ALSO READ: పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్, మున్షీ భేటీ.. ‘స్థానిక’పై ఓ కొలిక్కి
ప్రస్తుతం భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. ఆనాడు బీఆర్ఎస్ సరిగా రుణమాఫీ చేయకపోవడం వల్లే, దాని బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు. ప్రస్తుతం భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. ఆనాడు బీఆర్ఎస్ సరిగా రుణమాఫీ చేయకపోవడం వల్లే, ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు.
కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ హయాంలో సీఎం, పార్టీ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు
నరేంద్ర నుంచి రాజేంద్ర వరకూ ఎదిగిన బీసీ నేతలను అవమానించి పార్టీ నుంచి బయటకు పంపారు
బీసీ సమాజం బీఆర్ఎస్ ను ప్రశ్నించాలి… pic.twitter.com/uN97rRnsHI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025