E-Paper
Advertisement

మసాలా దట్టించి వండిన ఈ గుత్తి వంకాయ ముందు చికెన్, మటన్ కూడా బలాదూరే!

మసాలా దట్టించి వండిన ఈ గుత్తి వంకాయ ముందు చికెన్, మటన్ కూడా బలాదూరే!
Advertisement

Guthi Vankaya Curry: వంకాయ అంటేనే కూరల రాజు.. అందులోనూ మసాలా దట్టించిన గుత్తి వంకాయ కూర ఉంటే ఆ రోజంతా పండగే. చాలామందికి ఇష్టమైన ఈ వంటకం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కానీ పాతకాలపు పద్ధతిలో మసాలాలు నూరి వండితే వచ్చే ఆ సువాసనే వేరు. వేడివేడి అన్నంలోకి ఈ గ్రేవీ కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో అందరూ మెచ్చుకునేలా ఈ కూరను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు..

వంకాయలు అర కిలో, వేరుశనగ పప్పులు పావు కప్పు, తెల్ల నువ్వులు రెండు స్పూన్లు, ధనియాలు ఒక స్పూన్, జీలకర్ర అర స్పూన్, ఎండుమిర్చి ఐదు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, చింతపండు రసం కొద్దిగా, పసుపు, ఉప్పు, కారం తగినంత, నూనె నాలుగు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సిద్దం చేసుకోండి.

Advertisement

Also Read: సమ్మర్‌లో బాడీ సూపర్ కూల్‌గా ఉండాలా? అయితే ఇంట్లోనే ఈ హెల్దీ డ్రింక్స్‌ను ట్రై చేయండి!

తయారీ విధానం..

మొదట మసాలా కోసం వేరుశనగ పప్పులు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలను విడివిడిగా దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు రసం వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు లేత వంకాయలను తీసుకుని వాటిని కడిగి, చివరన కాడ ఉంచి మధ్యలోకి ప్లస్ ఆకారంలో నాలుగు పల్చలుగా కోయాలి. తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ప్రతి వంకాయలోనూ నిండుగా కూరాలి.

Advertisement

తర్వాత స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించి, అందులో మసాలా నింపిన వంకాయలను మెల్లగా వేయాలి. మంటను తక్కువలో ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో వంకాయలను జాగ్రత్తగా తిరగేస్తూ ఉండాలి. వంకాయలు సగం ఉడికాక, మిగిలిన మసాలా పేస్ట్‌ను కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. చివరగా తగినన్ని నీళ్లు పోసి కూర దగ్గరపడి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర సిద్ధం.

Also Read: ముక్క జ్యూసీగా, గ్రేవీ రుచిగా రావాలంటే చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×