E-Paper
Advertisement

Bihari Style Mutton Curry: గ్రేవీ అదిరిపోయేలా బీహారీ స్టైల్ మటన్ కర్రీ.. ఎలా వండాలో తెలుసా?

Bihari Style Mutton Curry: గ్రేవీ అదిరిపోయేలా బీహారీ స్టైల్ మటన్ కర్రీ.. ఎలా వండాలో తెలుసా?
Advertisement

Bihari Style Mutton Curry: బీహారీ స్టైల్ మటన్ కర్రీ (చంపారన్ మీట్ లేదా అహూనా మటన్ అని కూడా పిలుస్తారు)చాలా ఫేమస్. మట్టి పాత్రలో వండటం, వెల్లుల్లి గడ్డలను నేరుగా కూరలో వేయడం ఈ వంటకం స్పెషాలిటీ. చపాతీలు, ఫుల్కాలతో పాటు బిర్యానీలోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. మరి ఇంత రుచిగా ఉండే బీహారీ స్టైల్‌లో స్పైసీ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

మటన్: 1 కేజీ

ఉల్లిపాయలు: 1/2 కేజీ

Advertisement

ఆవ నూనె: 1 కప్పు

వెల్లుల్లి: 2 పూర్తి గడ్డలు (పొట్టు తీయకుండా శుభ్రం చేసినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి: 4-5

పెరుగు: 1/2 కప్పు

మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా.

పొడి మసాలాలు: కారం (3 స్పూన్లు), పసుపు (1 స్పూన్), ధనియాల పొడి (2 స్పూన్లు), జీలకర్ర పొడి (1 స్పూన్), గరం మసాలా (1 స్పూన్), రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం:

1. మటన్ మ్యారినేషన్ కోసం ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో సగం తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఆవ నూనె వేసి బాగా కలపండి. దీనిని కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి.

2.  బీహారీ స్టైల్ వంటల్లో ఆవ నూనెను పొగలు వచ్చే వరకు వేడి చేసి, ఆ తర్వాత చల్లార్చి వాడుతారు. ఇలా చేయడం వల్ల నూనెలోని పచ్చి వాసన పోతుంది. ఒకవేళ ఆవ నూనె ఇష్టం లేని వారు సాధారణ వంట నూనె వాడుకోవచ్చు.

3.  తర్వాత ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ తీసుకుని అందులో నూనె వేయండి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, లవంగాలు, ఇలాచీ వంటి హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించండి.

4. వేపుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక, రెండు వెల్లుల్లి గడ్డలను (పూర్తిగా) అందులో వేయండి. ఇది బీహారీ మటన్ యొక్క సిగ్నేచర్ స్టైల్.

Also Read: టేస్టీగా వేడి వేడి టమోటా పులావ్ తింటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో

5.  ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను గిన్నెలో వేసి బాగా కలపండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10-15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. మటన్ నుండి నీరు బయటకు వచ్చి మసాలాలన్నీ ముక్కలకు పడతాయి.

6. మసాలా, నీరు మటన్ సగం ఉడికిన తర్వాత, పెరుగు, గరం మసాలా వేసి కలపండి. నూనె పైకి తేలే వరకు వేయించి, ఆపై మీకు కావలసిన గ్రేవీకి తగ్గట్టుగా వేడి నీటిని పోయండి .

7. ఫినిషింగ్ టచ్ కోసం కుక్కర్ అయితే 4-5 విజిల్స్ వచ్చే వరకు, విడిగా పాత్రలో అయితే ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి.

ఈ ఘాటైన బీహారీ మటన్ కర్రీ వేడివేడి అన్నం లేదా రోటీలతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని వెల్లుల్లి గడ్డలు మటన్ జ్యూస్‌ను పీల్చుకుని చాలా రుచిగా ఉంటాయి.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×