E-Paper
Advertisement

Eggless Dry Fruit Cake: ప్రెజర్ కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్.. అచ్చం బేకరీ స్టైల్‌లో!

Eggless Dry Fruit Cake: ప్రెజర్ కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్.. అచ్చం బేకరీ స్టైల్‌లో!
Advertisement

Eggless Dry Fruit Cake: సాధారణంగా ఇంట్లోనే కేక్ చేసుకోవాలంటే ఓవెన్ ఉండాలి. అలాగే కేక్ తయారీలో కచ్చితంగా గుడ్లు కలపాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే ప్రెజర్ కుక్కర్‌లోనే బేకరీ స్టైల్ కేక్‌ను ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చేటప్పుడు బయట దొరికే ప్రిజర్వేటివ్స్ ఉన్న కేకుల కంటే, ఇంట్లోనే గోధుమ పిండి, నారింజ రసం, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ కేక్ చాలా ఆరోగ్యకరమైనది. అసలు గుడ్లు వాడకుండా, ఎంతో సాఫ్ట్‌గా వచ్చే ఈ డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానం మీకోసం..

కావాల్సిన పదార్థాలు:

ఈ కేక్ తయారీకి ఒక కప్పు మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, టూటీ ఫ్రూటీ, ఖర్జూరం, చెర్రీస్), ఒక కప్పు నారింజ రసం, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, ముప్పావు కప్పు పంచదార పొడి, అర కప్పు చక్కెర (కారామెల్ కోసం), అర కప్పు పెరుగు, అర కప్పు నూనె లేదా నెయ్యి, అర కప్పు పాలు, ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు జాజికాయ పొడి, కొద్దిగా అల్లం పొడి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు సిద్ధం చేసుకోవాలి.

Advertisement

Also Read: సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా చేసే బాదం షర్బత్.. తయారీ విధానం ఇదే!

తయారీ విధానం:

ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నింటినీ నారింజ రసంలో కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. దీనివల్ల కేక్ తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న పాన్‌లో అర కప్పు చక్కెర వేసి తక్కువ మంటపై వేడి చేస్తూ కారామెల్ సిరప్ సిద్ధం చేసుకోవాలి. చక్కెర కరిగి ముదురు గోధుమ రంగులోకి వచ్చాక కొద్దిగా వేడి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో పెరుగు, పంచదార పొడి వేసి బాగా కలిపి, అందులో నూనె, వెనిల్లా ఎసెన్స్ మరియు మనం తయారు చేసుకున్న కారామెల్ సిరప్‌ను కలపాలి. దీనికి జల్లెడ పట్టిన గోధుమ పిండి, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిగతా పొడులను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చివరగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను రసంతో సహా వేసి బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి.

కుక్కర్‌లో పెట్టే విధానం:

మరోవైపు కుక్కర్ అడుగున కొంచెం ఉప్పు వేసి, ఒక స్టాండ్ ఉంచి విజిల్ రింగ్ లేకుండా పది నిమిషాలు వేడి చేయాలి. నెయ్యి రాసిన కేక్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి, పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకుని కుక్కర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. మంటను పూర్తిగా తగ్గించి 45 నుండి 60 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ మధ్యలో టూత్ పిన్ గుచ్చి చూస్తే అది అంటుకోకుండా వస్తే మీ కేక్ రెడీ అయినట్లే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుంటే ఎంతో మృదువైన, రుచికరమైన హెల్తీ కేక్ సిద్ధం.

Also Read: జిమ్ లవర్స్ కోసం హై ప్రోటీన్ మష్రూమ్ ఆమ్లెట్.. తక్కువ పదార్థాలతో ఇన్‌స్టంట్‌గా!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×