E-Paper
Advertisement

Badam Sharbat: సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా చేసే బాదం షర్బత్.. తయారీ విధానం ఇదే!

Badam Sharbat: సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా చేసే బాదం షర్బత్.. తయారీ విధానం ఇదే!
Advertisement

Badam Sharbat: వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి తక్షణ శక్తినిచ్చే పానీయాల్లో బాదం షర్బత్ ప్రత్యేకం. బయట దొరికే కృత్రిమ పానీయాల కంటే ఇంట్లోనే స్వచ్ఛంగా తయారుచేసుకునే ఈ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు చల్లని బాదం షర్బత్ తాగితే వచ్చే ఆ రిఫ్రెష్‌మెంట్ మాటల్లో చెప్పలేం. అతిథులకు కూడా ఇదొక అద్భుతమైన వెల్‌కమ్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇప్పుడీ డ్రింక్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

కావాల్సిన పదార్థాలు:

బాదం పప్పులు – అర కప్పు
పంచదార – రెండు కప్పులు
నీళ్లు – నాలుగు కప్పులు
యాలకులు – రెండు టీస్పూన్లు

Advertisement

Also Read: రంజాన్ ఈద్ విందులో ఈ 4 వంటకాలు ఉండి తీరాల్సిందే!

తయారీ విధానం:

ముందుగా బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు, పంచదార, యాలకుల పొడి వేసి బాగా మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి మిశ్రమం కాస్త చిక్కబడి తీగ పాకంలా వచ్చే వరకు ఉంచి, ఆపై స్టవ్ ఆపి చల్లార్చుకోవాలి.

Advertisement

ఇప్పుడు మిక్సీ జార్‌లో పొట్టు తీసిన బాదం పప్పులను వేసి, అందులో సిద్ధం చేసుకున్న పంచదార పాకాన్ని కొద్దిగా పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మిగిలిన పాకంలో కలిపేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మీరు తాగాలనుకున్నప్పుడు ఒక గ్లాసులో రెండు చెంచాల ఈ బాదం మిశ్రమాన్ని వేసి, చల్లని నీళ్లు లేదా పాలు కలిపి ఐస్ క్యూబ్స్‌తో సర్వ్ చేస్తే రుచికరమైన బాదం షర్బత్ రెడీ అయిపోతుంది.

బాదం షర్బత్‌తో కలిగే ప్రయోజనం: 

బాదం షర్బత్ కేవలం టేస్టీ డ్రింక్ మాత్రమ కాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాదంలో సమృద్ధిగా ఉండే విటమిన్ E, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఎండల్లో బయట తిరిగి వచ్చినప్పుడు ఈ షర్బత్ తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరం చల్లబడుతుంది. దీనిలోని పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందించి, నీరసాన్ని దరిచేరనివ్వవు. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: చెరుకురసంతో ఐస్‌క్రీమ్.. ఈ సమ్మర్‌లో ఇలా చేసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×