E-Paper
Advertisement

Mushroom Omelette: జిమ్ లవర్స్ కోసం హై ప్రోటీన్ మష్రూమ్ ఆమ్లెట్.. తక్కువ పదార్థాలతో ఇన్‌స్టంట్‌గా!

Mushroom Omelette: జిమ్ లవర్స్ కోసం హై ప్రోటీన్ మష్రూమ్ ఆమ్లెట్.. తక్కువ పదార్థాలతో ఇన్‌స్టంట్‌గా!
Advertisement

Mushroom Omelette: సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే మన శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. అయితే జిమ్ వర్కౌట్స్ చేసేవాళ్లు మనతో పోలిస్తే మరింత ఎక్కువ ప్రొటీన్ కంటెంట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకి బ్రేక్‌ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆమ్లెట్. కానీ, ప్రతిరోజూ రొటీన్ ఆమ్లెట్ ఏం తింటారు చెప్పండి. అందుకే ఒకసారి ఈ మష్రూమ్ ఆమ్లెట్ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ రుచిగానే కాదు.. మన శరీరానికి కావలసిన ప్రోటీన్లను కూడా పుష్కలంగా అందిస్తుంది. హోటల్ స్టైల్‌లో మెత్తగా, ఫ్లఫీగా రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

కోడి గుడ్లు – 2 లేదా 3
మష్రూమ్స్ – ఒక కప్పు (సన్నని ముక్కలు)
వెన్న లేదా ఆలివ్ ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి, ఉప్పు – రుచికి సరిపడా
తురిమిన చీజ్ – కొద్దిగా
ఉల్లిపాయలు, కొత్తిమీర – తగినంత (సన్నగా తరిగినవి)

Advertisement

Read Also: డయాబెటిస్ పేషెంట్లకు వరం ఈ జొన్న గుగ్గిళ్లు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!

తయారీ విధానం:

సాధారణంగా మష్రూమ్స్‌లో నీటి శాతం ఎక్కువ కాబట్టి.. వాటిని నేరుగా గుడ్డులో కలపకుండా ఒక పాన్‌లో కొద్దిగా వెన్న వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో గుడ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా నురగ వచ్చే వరకు గిలకొట్టాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే ఆమ్లెట్ అంత మెత్తగా వస్తుంది.

Advertisement

అదే పాన్‌ను తక్కువ మంటపై ఉంచి, వెన్న కరిగిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని వేయాలి. అది కాస్త కొంచెం సెట్ అవుతున్న సమయంలో, ముందుగా వేయించిన మష్రూమ్స్, చీజ్‌ను ఒక వైపున వేసి ఆమ్లెట్‌ను సగానికి మడవాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి మష్రూమ్ ఆమ్లెట్ సిద్ధం. ఇది తింటే మధ్యాహ్నం వరకు మీకు ఆకలి వేయదు, రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉంటారు.

Read Also: వారానికి ఒక్కసారైనా వండాల్సిందే.. అంత రుచిగా ఉండే కోడిగుడ్డు మునక్కాయ పులుసు!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×