Mushroom Masala Curry: సాధారణంగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలామంది పుట్టగొడుగులను చూసి కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒక్కసారి వీటి రుచి మరిగారంటే మాత్రం వదిలిపెట్టరు. ముఖ్యంగా శాఖాహారులకు పుట్టగొడుగులు ఒక వరమనే చెప్పాలి. దీని రుచి దాదాపు చికెన్ మాదిరిగానే ఉంటుంది. పుట్టగొడుగుల్లో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ డి దీనిలో పుష్కలంగా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ అద్భుతమైన ఆహారంతో ఇంట్లోనే ఎంతో రుచికరమైన గ్రేవీ కర్రీని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అరకిలో పుట్టగొడుగులు (250 గ్రాములు), రెండు పెద్ద ఉల్లిపాయలు, పండు టొమాటోలు, తగినంత నూనె, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు పచ్చిమిర్చి, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ధనియాల పొడి, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలి.
Also Read: 10 నిమిషాల్లో అదిరిపోయే బచ్చలికూర రోటి పచ్చడి.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కాస్త వేడెక్కాక జీలకర్రతో పాటు లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు వేసి చిటపటలాడించాలి. ఇవి మంచి సువాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి.
ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ ఉల్లిపాయ మిశ్రమానికి పట్టేలా బాగా కలపాలి. మసాలా మాడిపోకుండా జాగ్రత్త పడుతూ, కడిగి శుభ్రం చేసుకున్న పుట్టగొడుగుల ముక్కలను దీనిలో వేయాలి. పుట్టగొడుగులు మసాలాతో కలిసి వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి కలపాలి.
మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే తగినన్ని నీళ్లు పోసి, ఒకసారి ఉప్పు చూసుకుని సరిచేసుకోవాలి. ఇప్పుడు పాన్ మీద మూత పెట్టి సుమారు 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. పుట్టగొడుగులు మెత్తబడి, గ్రేవీ చిక్కగా అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని స్టవ్ ఆపేయాలి.
Also Read: చపాతీ, పుల్కాల్లోకి బెస్ట్ కాంబినేషన్.. ఇంట్లోని పదార్థాలతో ‘కాజూ పనీర్ బుర్జీ’ తయారీ విధానం!