E-Paper
Advertisement

Malabar Spinach Pachadi: 10 నిమిషాల్లో అదిరిపోయే బచ్చలికూర రోటి పచ్చడి.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

Malabar Spinach Pachadi: 10 నిమిషాల్లో అదిరిపోయే బచ్చలికూర రోటి పచ్చడి.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!
Advertisement

Malabar Spinach Pachadi: ఆకుకూర అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ‘బచ్చలికూర’. ఇది తినడానికి రుచిగానే కాదు.. దీనిలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. విటమిన్ A, C, K లతో పాటు ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు బచ్చలి కూరలో పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆకుకూరతో పప్పు, పులుసు ఎలా చేసినా అద్భుతంగా ఉంటుంది. అయితే.. వేడి వేడి అన్నంలోకి బచ్చలికూర రోటి పచ్చడి ఉంటే ఆ మజానే వేరబ్బా. మరి ఆ టేస్టీ పచ్చడిని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు:

బచ్చలికూర – 3 నుంచి 4 కట్టలు (శుభ్రంగా కడిగి తరిగినవి)
ఎండుమిర్చి – 15 (కారానికి తగ్గట్టు)
పచ్చిమిర్చి – 5 నుంచి 6
చింతపండు – నిమ్మకాయ సైజులో సగం
తాలింపు దినుసులు – టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మెంతులు
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి తగినంత

Advertisement

Also Read: జీర్ణ సమస్యలకు చెక్ పెట్టి.. లివర్‌ని క్లీన్ చేసే కరివేపాకు.. పళ్లెం నుంచి తీసిపారేస్తే నష్టపోయేది మీరే!

తయారీ విధానం.. స్టెప్ బై స్టెప్:

ముందుగా స్టవ్ మీదపాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. చివరగా ధనియాలు, మెంతులు కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

Advertisement

తర్వాత అదే పాన్‌లో ఇంకాస్త నూనె వేసి, తరిగి పెట్టుకున్న బచ్చలికూర, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు వేయండి. ఆకుకూరలోని నీరంతా పోయి మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చాలి.

మిక్సీ జార్‌లో మొదట వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి పొడి చేయాలి. ఆ తర్వాత అందులోనే మగ్గించి పెట్టుకున్న బచ్చలికూర మిశ్రమం, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే రోటి పచ్చడి రుచి వస్తుంది. అంతే.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బచ్చలికూర పచ్చడి రెడీ.

Also Read: నీరసం, అలసట మాయం.. శరీరంలో రక్తాన్ని పెంచే నేచురల్ డ్రింక్స్!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×