E-Paper
Advertisement

Cabbage Egg Fry Recipe: క్యాబేజీ తినని వాళ్లు కూడా ఫిదా అవ్వాల్సిందే.. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి!

Cabbage Egg Fry Recipe: క్యాబేజీ తినని వాళ్లు కూడా ఫిదా అవ్వాల్సిందే.. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి!
Advertisement

Cabbage Egg Fry Recipe: ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేది చికెన్ లేదా కోడి గుడ్లు. కానీ, మనకు అందుబాటులో ఉండే కూరగాయలతో కూడా అద్భుతమైన ప్రోటీన్ రిచ్ డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో క్యాబేజీ ఎగ్ ఫ్రై ఒకటి. క్యాబేజీలోని ఫైబర్, కోడిగుడ్డులోని హై ప్రోటీన్ కలిస్తే.. అది సంపూర్ణ ఆహారంగా మారుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి, కండరాల పుష్టి కావాలనుకునే వారికి ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు:

క్యాబేజీ – 2 కప్పులు (చాలా సన్నగా తరిగినవి)
కోడిగుడ్లు – 3
పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నగా తరుక్కోవాలి)
పచ్చిమిర్చి – 2 (చీలికలు)
వెల్లుల్లి – 4 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచినవి)
నూనె – 2 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు – అరటీస్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
మసాలాలు – ఉప్పు (రుచికి సరిపడా)
పసుపు – అర టీస్పూన్
కారం – ఒకటీస్పూన్
ధనియాల పొడి – ఒకటీస్పూన్

Advertisement

Also Read: పాలకూరను పచ్చిగా తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

వండే పద్ధతి ఇది:

స్టవ్ మీద పాన్ పెట్టి.. సరిపడ నూనె వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించండి. దానిలోనే దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.

Advertisement

తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి దోరగా వేగిన తర్వాత, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుమును వేయాలి. దీనికి తగినంత ఉప్పు, పసుపు కలిపి మూత పెడితే, క్యాబేజీ త్వరగా మగ్గుతుంది.

క్యాబేజీ బాగా వేగిన తర్వాత, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి 3 కోడిగుడ్లను పగులగొట్టి వేయాలి. ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి, ఆపై చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా కలపాలి.

కోడి గుడ్డు మిశ్రమం అంతా క్యాబేజీకి పట్టాక.. కారం, ధనియాల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే సరి.

Also Read: 10 నిమిషాల్లో అదిరిపోయే బచ్చలికూర రోటి పచ్చడి.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×