E-Paper
Advertisement

BRS : ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఎవరు?

BRS : ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఎవరు?
Advertisement

బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసగా సిట్ అధికారులు నోటీసులు పంపడం, విచారణకు రావాలని పిలవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చోటా మోట నేతలంతా భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తున్నది. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని ముందుండి నడిపించే నేతలు విచారణకు వెళ్తూ వస్తున్నారు.ఇక ఈ వ్యవహారంతో గులాబీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు మొదలెట్టారు.మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బకొట్టాలనే ప్రభుత్వం ఇలా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందని కారు పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ముందు హరీశ్ రావు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరావ్‌ను విచారించిన సిట్ అధికారులు.. అంతకుముందే తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఓ న్యూస్ మీడియా చైర్మన్ శ్రవణ్ రావునూ విచారించారు. ఆ తర్వాత వీరంతా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ ప్రారంభించిన సిట్.. ముందుగా శ్రవణ్ రావు తన వాంగ్మూలంలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావన వచ్చిందని పేర్కొంటూ ముందుగా ఆయనకు విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. దీంతో ఆయనకు రెండ్రోజుల కింద విచారణకు హాజరయ్యారు. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేసి బయటకు వచ్చారు. ఈ కేసులో మరోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని సిట్ పర్యవేక్షణాధికారి సజ్జనార్.. హరీశ్ రావుకు చెప్పినట్టు ప్రకటించారారు.

నిన్న కేటీఆర్..

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌..విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వడంతో ఆయన నిన్న ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆయన హాజరయ్యారు.గత ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ పెద్దలు, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేయడం గురించి పలు ప్రశ్నలు సిట్ సంధించినట్టు తెలిసింది. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని కేటీఆర్ సైతం బయటకు వచ్చి తీవ్ర అసహనం వక్తంచేశారు. ఇక బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్ రావు, కేటీఆర్ విచారణ అనంతరం తదుపరి నోటీసులు ఎవరికి అందనున్నాయని గులాబీ పార్టీలో జోరుగా చర్చ నడుస్తున్నది. నాటి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తర్వాత హరీశ్ రావు, కేటీఆర్‌లదే పెత్తనం..

Harsha Vardhan: మందుబాబులకు హర్షవర్ధన్ అలెర్ట్.. ఏం చెబుతున్నారంటే?

Advertisement

వారిద్దరి విచారణ ముగిసినందున మాజీ మంత్రులకు నోటీసులు వెళ్తాయా? లేక ఏకంగా గులాబీ బాస్‌కే సిట్ నోటీసులు ఇస్తుందా?అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీ వ్యవహారంలో కేసీఆర్‌ను కాళేశ్వరం కమిషన్ నివేదిక దోషిగా తేల్చింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయనకు నోటీసులు అందుతాయని టాక్ వినిపిస్తోంది. నాడు ముఖ్యమంంత్రిగా చేసిన కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఏది జరగదు కాదా? అని ప్రస్తుతం అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలను తొక్కిపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ చూశారని.. అందుకే వారి ఫోన్లు ట్యాప్ చేయించారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, సిట్ విచారణ ముగింపుపై నేటికీ క్లారిటీ లేకపోవడంతో తదుపరి నోటీసులు ఎవరికి వస్తాయా? అని గులాబీ నేతలు భయాందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×