E-Paper
Advertisement

తెలంగాణ స్టైల్ బగారా అన్నం.. ముద్దపప్పు లేదా నాటుకోడి కూరతో తింటే ఇక స్వర్గమే!

తెలంగాణ స్టైల్ బగారా అన్నం.. ముద్దపప్పు లేదా నాటుకోడి కూరతో తింటే ఇక స్వర్గమే!
Advertisement

Bagara Annam: తెలంగాణ విందు భోజనాల్లో బగారా అన్నం లేకపోతే ఆ ముచ్చటే వేరుగా ఉంటుంది. పండుగైనా, ఫంక్షన్ అయినా అందరూ ఇష్టంగా అడిగి చేయించుకునే వంటకం ఇది. బిర్యానీ అంత హడావుడి లేకుండా.. కేవలం అర గంటలో ఘుమఘుమలాడే రుచితో దీన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా నాటు కోడి కూర లేదంటే గుత్తి వంకాయ కూరతో కలిపి తింటే టేస్ట్ భలే ఉంటుంది. మరి ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో ఈ బగారా అన్నాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా..

కావలసిన పదార్థాలు:

ఈ రుచికరమైన వంటకానికి రెండు కప్పుల బాస్మతీ బియ్యం లేదంటే సోనా మసూరి బియ్యం, తగినంత నూనె లేదా నెయ్యి, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వంటి మసాలా దినుసులు అవసరం. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, తాజాగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు పుదీనా ఆకులు, కొత్తిమీర, తగినంత ఉప్పు సిద్ధం చేసుకోవాలి.

Advertisement

Also Read: రాయలసీమ స్పెషల్ నాటు కోడి పులుసు.. రాగి సంకటిలోకి అదిరిపోయే రుచి!

తయారీ విధానం:

బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె కాగాక షాజీరా, లవంగాలు వంటి మసాలా దినుసులన్నీ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి అవి కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.

Advertisement

ఇవన్నీ బాగా వేగాక ఎసరు కోసం ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేయాలి. ఎసరు బాగా మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి మంటను మీడియంలో ఉంచాలి. ఎసరు సగానికి పైగా ఇగిరిపోయాక, మూత పెట్టి మంటను తగ్గించి మరో పది నిమిషాల పాటు దమ్ వేయాలి. అన్నం పొడిపొడిగా ఉడికాక స్టవ్ ఆపేసి ఓ పది నిమిషాలు అలాగే వదిలేస్తే.. వేడి వేడి బగారా అన్నం వడ్డించడానికి రెడీ అయినట్టే.

Also Read: పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×